బాలీవుడ్ ప్రముఖ నటి మమతా కులకర్ణి ఈ మధ్యన ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ప్రయాగ్ రాజ్ లో జరుగుతోన్న కుంభమేళాలో సన్యాసం తీసుకున్న ఆమె కిన్నెర అఖాడా నుంచి మహామండలేశ్వరి గుర్తింపు పొందింది. అయితే ఇది జరిగిన వారం రోజుల్లోనే మమతపై బహిష్కరణ వేటు పడింది. ఇది చాలా చర్చకు దారితీసింది. మమతపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రపంచంలో ఉన్న మమత ఉన్నట్లుండి ఆధ్యాత్మికత దారిలోకి ఎందుకొచ్చారని పలువురు స్వామిజీలు, సాధువులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇదే సమయంలో మహామండలేశ్వరిగా మారేందుకు ఆమె 10 కోట్ల రూపాయలు ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మమత వీటిపై స్పందించింది. 2015లో ప్రారంభించబడిన కిన్నెర అఖాడా ఉన్నట్లుండి నటి మమతా కులకర్ణిని మహామండలేశ్వరిగా నియమించింది. అయితే తీవ్ర వ్యతిరేకత రావడంతో వెంటనే ఆమెను తొలగించింది. చాలా మంది మత పెద్దలు మమతకు’మహామండలేశ్వరి’ గుర్తింపు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. రామ్‌దేవ్ బాబా కూడా దీనిని విభేదించారు. ‘ఎవరూ ఒక్కరోజులో సన్యాసం పొందలేరు. ‘‘ఈరోజుల్లో ఎవరో ఒకరిని పట్టుకుని మహామండలేశ్వరిని చేయడం చూస్తున్నాను’అంటూ ఇన్ డైరెక్టుగ మమత ను విమర్శించారు. ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు మమత స్వయంగా సమాధానమిచ్చింది.
కాగా మహా కుంభమేళా నుంచి బయటకు వచ్చిన మమత కులకర్ణి రజత్ శర్మ ‘యాప్ కి అదాలత్’ కార్యక్రమానికి వచ్చింది. ఈ సారి బాబా రామ్ దేవ్ తదితరుల ప్రకటనలకు ఆమె బదులిచ్చారు. ‘మహాకాళుడు, మహాకాళికి భయపడాలని రామ్‌దేవ్‌కు చెప్పాలనుకుంటున్నాను” అని అన్నారు. ఇక మహామండలేశ్వరి బిరుదు పొందడానికి మమతా కులకర్ణి 10 కోట్ల రూపాయలు ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణతో ఆమె ఏకీభవించలేదు. కేవలం 2 లక్షల రూపాయలను గురుదక్షిణగా మాత్రమే ఇచచానంటోంది. ‘గురుదక్షిణగా 2 లక్షల రూపాయలు ఇచ్చాను. నా బ్యాంకు ఖాతాలన్నీ స్తంభించిపోయాయి. అందుకని వేరొకరి దగ్గర డబ్బులు తీసుకుని ఇచ్చాను’ అని మమత చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి
మహా మండలేశ్వరిగా మమతా కులకర్ణిని తొలగిస్తూ ఆదేశాలు..
Rishi Ajay Das, laminitis of Kinnar Akhara, expels Mamta Kulkarni from the Akhara. He has besides expelled Mahamandaleshwar Laxminarayan Tripathi from the Kinnar Akhara for inducting Mamta Kulkarni, who is accused of treason, to the Akhara and designating her arsenic Mahamandaleshwar… pic.twitter.com/Hhzezst49r
— ANI (@ANI) January 31, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి