అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా థియేటర్లలో విడుదలై రెండు నెలలైంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. ‘బాహుబలి 2’ కలెక్షన్లను సైతం అధిగమించింది. ఇక కొన్ని రోజుల క్రితమే ఓటీటీలోకి పుష్ప 2 వచ్చేసింది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ ఈ మూవీ రికార్డులు బద్దలు కొడుతోంది.
Allu Sirish
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. ఇండియన్ షేక్ చేసింది ఈ సినిమా. ఇండియన్ మూవీ మూవీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేసింది ఈ సినిమా ఏకంగా రూ . 18వందల కోట్లకు పైగా వసూల్ చేసింది పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. గతంలో వచ్చిన పుష్ప సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. పుష్ప భారీ విజయం సాధించడంతో పుష్ప 2 పై భారీ ఆ అంచనాలు క్రియేట్ అయ్యేయి ఊహించినట్టే పుష్ప 2 సినిమా విడుదలై సంచలనం సృష్టించింది. థియేటర్స్ లో దుమ్మురేపిన పుష్ప 2 సినిమ ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతుంది.
పుష్ప 2 సినిమాకు సంక్రాంతి కానుకగా రీ లోడెడ్ వర్షన్ ను విడుదల చేశారు. కొన్ని సీన్స్ యాడ్ చేసి రీలోడెడ్ వర్షన్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఓటీటీలో కూడా పుష్ప 2 రీ లోడెడ్ వర్షన్ రిలీజ్ అయ్యింది. పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ నటన పై అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ సోదరుడు, నటుడు శిరీష్ కూడా పుష్ప 2 సినిమా పై స్పందించాడు. సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ షేర్ చేయాడు శిరీష్.
పుష్ప 2 సినిమాను ఓటీటీలో చూసి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు శిరీష్. థియేట్రికల్ వెర్షన్ లో మిస్సయిన లింక్స్ అన్నిటినీ కవర్ చేసారని శిరీష్ చెప్పుకొచ్చాడు. ‘పుష్ప 2’ క్లైమాక్స్ లో పుష్పరాజ్ తన ఇద్దరు సోదరులను పట్టుకొని ఏడుస్తున్న సన్నివేశాన్ని ఫోటో తీసి అల్లు శిరీష్ ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. దాని కింద ”రీలోడెడ్ వెర్షన్ చాలా హై ఇచ్చింది. సినిమా చివరి వరకూ కన్నీళ్లు వచ్చాయి. థియేట్రికల్ వెర్షన్ లో మిస్ అయిన లింక్స్ అన్నీ ఇక్కడ కవర్ చేశారు” అంటూ రాసుకొచ్చాడు. పుష్ప సినిమా రన్ టైం 3.20గంటలు.. రీలోడెడ్ వర్షన్ తో కలిపి ఓటీటీలోకి వచ్చేసరికి 3: 40గంటలు అయ్యింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి