రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో సర్వీసెస్ జట్టు అద్భుతమైన చరిత్ర సృష్టించింది. ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు సూరజ్ వశిష్ట్-శుభమ్ రోహిల్లా వికెట్ కోల్పోకుండా 376 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచ రికార్డును నెలకొల్పారు.
మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఒడిశా 180 పరుగులకు ఆలౌటవ్వగా, సర్వీసెస్ 199 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో తక్కువ స్కోర్లతో సాగిన పోరులో ఒడిశా మూడో ఇన్నింగ్స్‌లో 394 పరుగులు చేసి, సర్వీసెస్‌ను 376 పరుగుల భారీ ఛేదనలోకి నెట్టింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సర్వీసెస్ 46/0తో నిలిచింది.
చివరి రోజున 85.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా సర్వీసెస్ విజయాన్ని ఖాయంచేసింది. ఓపెనర్ వశిష్ట్ 154 పరుగులు (246 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) చేయగా, రోహిల్లా 209 పరుగులు (270 బంతుల్లో 30 ఫోర్లు) చేసి జట్టును అజేయంగా గెలిపించాడు.
ఈ విజయంతో సర్వీసెస్ క్రికెట్‌లో ఓ జట్టు వికెట్ నష్టపోకుండా అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన రికార్డును సాధించింది. అంతకుముందు 1998-99లో సర్గోధ జట్టు లాహోర్ సిటీని 332/0 స్కోరుతో ఓడించడం అత్యుత్తమ ఛేదనగా ఉండేది.
నాలుగో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా అత్యధిక చేసింగ్ జాబితా
1. 376/0 – సూరజ్ వశిష్ట్ (154*), శుభమ్ రోహిల్లా (209*) – సర్వీసెస్ vs ఒడిశా, 2024-25 2. 332/0 – అబ్దుల్ బాసిత్ (156*), నవేద్ లతీఫ్ (162*) – సర్గోధ vs లాహోర్ సిటీ, 1998-99 3. 276/0 – బాబీ సింప్సన్ (142*), నార్మన్ ఓ’నీల్ (133*) – న్యూ సౌత్ వేల్స్ vs దక్షిణ ఆస్ట్రేలియా, 1964-65 4. 270/0 – బాబీ అబెల్ (120*), బిల్ బ్రోక్‌వెల్ (132*) – సర్రే vs కెంట్, 1900 5. 250/0 – వీవీ రిచర్డ్స్ (120*), డెస్మండ్ హేన్స్ (103*) – వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా, 1983-84
ఈ అద్భుత విజయంతో సర్వీసెస్ జట్టు రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ Aలో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే, వారు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. ఒడిశా ఆరో స్థానంలో నిలిచింది.
ఇలాంటి ఘన విజయాలు భారత దేశీయ క్రికెట్ స్థాయిని మరింతగా పెంచుతాయి. సర్వీసెస్ జట్టు చరిత్ర సృష్టించిన ఈ విజయంతో క్రికెట్ ప్రపంచం మరోసారి ఆశ్చర్యానికి గురైంది.
ఈ విజయంతో సర్వీసెస్ జట్టు కేవలం రికార్డు స్థాయిలో లక్ష్యాన్ని ఛేదించిందేకాదు, యువ ఆటగాళ్ల ప్రతిభను ప్రపంచానికి చూపించింది. ముఖ్యంగా ఓపెనర్లు సూరజ్ వశిష్ట్, శుభమ్ రోహిల్లా తమ సహనంతో, అద్భుత బ్యాటింగ్‌తో జట్టును అజేయ విజయానికి నడిపించారు. భారీ ఛేదనలో ఒత్తిడికి లోనుకాకుండా, ఓర్పుతో ఆడటం వారి ఆట తీరు భవిష్యత్తులో పెద్ద స్థాయిలో ఆడేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ విజయంతో భారత దేశీయ క్రికెట్‌లో ఓ కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..