ప్రతి పనికి మంచి ఘడియలు.. ముహూర్తం.. సమయం చూసుకుని అడుగు బయటకు పెట్టని బాలకృష్ణ చేతి గడియారం ఆగిపోయింది.. ఇది వినడానికి విచిత్రంగానే ఉన్నా.. ఇది మాత్రం కరక్టే.. ఎందుకో ఈ కథనాన్ని ఒక్కసారి చదవండి.. హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో ప్రతి నిమిషం ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పిన సమయానికే జరిగింది.. క్యాంపు నుంచి టిడిపి కౌన్సిలర్లను తీసుకురావడానికి ముహూర్తం.. టైం చెప్పింది ఎమ్మెల్యే బాలకృష్ణ… మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవడానికి ముహూర్తం పెట్టారు ఎమ్మెల్యే బాలకృష్ణ… ఆఖరికి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన రమేష్ ప్రమాణస్వీకారం అనంతరం… చైర్మన్ కుర్చీలో కూర్చోవడానికి కూడా ముహూర్తం పెట్టారు. ఉదయం 9 గంటల పది నిమిషాలకు క్యాంపు నుంచి కౌన్సిలర్లు బయటకు రావాలి అని బాలకృష్ణ టైం చెప్పారు.. సరిగ్గా 10: 45 నిమిషాలకు హిందూపురం మున్సిపల్ కార్యాలయం లోపలికి కౌన్సిలర్లతో బాలకృష్ణ వచ్చేందుకు కూడా టైం డిసైడ్ చేశారు. సరిగ్గా ఉదయం 11:30 నిమిషాలకు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన రమేష్ చైర్మన్ కుర్చీలో కూర్చోవాలని బాలకృష్ణ టైం డిసైడ్ చేశారు.
అప్పటివరకు అన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పిన సమయానికి.. సరిగ్గా ముహూర్తానికి… చెప్పిన టైంకే జరిగాయి. మున్సిపల్ చైర్మన్ రమేష్ చైర్మన్ కుర్చీలో కూర్చోవడానికి బాలకృష్ణ తో పాటు వేచి చూస్తున్నారు.. సరిగ్గా అదే సమయంలో బాలకృష్ణ అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులకు ప్రతిదానికి టైం ఉంటుంది.. చైర్మన్ రమేష్ కుర్చీలో కూర్చోవడానికి కూడా.. అలాగే టైం డిసైడ్ అయిందంటూ అందరినీ నవ్వించారు.
వీడియో చూడండి..
అయితే బాలకృష్ణ తన చేతికున్న వాచ్ టైం చూసుకుని.. నా వాచ్ ఆగిపోయింది… టైం ఎంతైందని అక్కడ ఉన్నవారిని అడిగారు. 11 గంటల 30 నిమిషాలు అయిందని చెప్పడంతో… వెంటనే బాలకృష్ణ చైర్మన్ గా ఎన్నికైన రమేష్ ను కుర్చీలో కూర్చోమని చెప్పారు. ఉదయం నుంచి హిందూపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అయ్యేవరకు ప్రతిదీ ఎమ్మెల్యే బాలకృష్ణ ముహూర్తం… టైం చెప్పినట్లుగానే జరిగితే.. కుర్చీలో కూర్చునే సమయానికి మాత్రం ఎమ్మెల్యే బాలకృష్ణ చేతి గడియారం ఆగిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఎప్పుడు ఘడియలు.. ముహూర్తం.. టైం చూసుకునే పని చేసే బాలకృష్ణ చేతి గడియారం ఆగిపోవడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే అంటూ పలువురు నాయకులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..