కంపెనీలు తమ పండగలకు బోనస్‌లు ఇవ్వడం.. ఆరు నెలలకో, ఏడాదికో సాలరీస్ పెంచడం చూస్తుంటాం. ఇక స్పెషల్ వెకేషన్స్‌లో రకరకాల గిఫ్టులు కూడా ఇచ్చి ఎంప్లాయిస్‌ను సర్ప్రైజ్ చేస్తుంటాయి. అయితే ఓ కంపెనీ తమ ఉద్యోగులకు బోనస్‌లు, ఇంక్రిమెంట్లు కాకుండా దిమ్మతిరిగే బంపరాఫర్ ఇచ్చింది. టేబుల్‌పై ఏకంగా 70 కోట్ల రూపాయలను కుమ్మరించింది.
అయితే నగదు తీసుకునే ముందు వారికి ఓ కండీషన్ పెట్టింది. ఒక్కొక్కరు ఎంత లెక్కపెడితే అంత డబ్బు మీదేనంటూ ఊరించింది. అందుకు 15 నిమిషాల కండిషన్ పెట్టింది ఆ కంపెనీ. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. స్థానిక హెనాన్ మైనింగ్ క్రేన్ కో అనే లిమిటెడ్ కంపెనీ.. తమ ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది. ఉద్యోగుల ముందు పొడవాటి బేటుల్ ఏర్పాటు చేసి, దానిపై సుమారు 100 మిలియన్ యువాన్లు కుమ్మరించింది. అంటే మన కరెన్సీలో దాదాపు 70 కోట్ల రూపాయలు. టేబుల్ చుట్టూ ఉద్యోగులను నిలబెట్టారు. ఉద్యోగులకు 15 నిముషాల సమయం ఇస్తూ.. ఆ సమయంలోగా ఎంత డబ్బు లెక్కపెడితే అంత నగదును మీ ఇంటికి తీసుకెళ్లవచ్చని చెప్పింది. హుషారుగా రంగంలోకి దిగిన ఉద్యోగులు తమ చేతులకు పని పెట్టారు. 15 నిముషాల సమయంలోగా ఎవరికి సాధ్యమైనంత రీతిలో వారు నగదును లెక్కపెట్టి బ్యాగుల్లో వేసుకున్నారు. ఓ ఉద్యోగి 15 నిముషాల వ్యవధిలో 11 లక్షలకు పైగా నగుదును లెక్కపెట్టాడట. మొత్తానికి తమ ఉద్యోగులకు కంపెనీ విచిత్రమైన కండీషన్ పెట్టి, అద్భుతమైన ఆఫర్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆఫర్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: