పుంగనూరు అల్లర్ల కేసులో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, బెయిల్ షరతుల ప్రకారం పలమనేరు డీఎస్పీ కార్యాలయంలో హాజరయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు షూరిటీలు సమర్పించారు. మిథున్ రెడ్డితో పాటు మరికొందరు నిందితులు కూడా ఈ కేసులో ఉన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి డీఎస్పీ ముందు హాజరు కావాలన్న షరతు ఉంది.
Peddireddy Midhun Reddy
చిత్తూరు జిల్లా పుంగనూరు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ పొందిన రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. శుక్రవారం పలమనేరు డిఎస్పీ కార్యాలయానికి వచ్చారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు పలమనేరు డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న మిధున్ రెడ్డి.. బెయిల్ లోని షరతులు ప్రకారం షూరిటీలు సమర్పించారు. గత జూలై 18 న పుంగనూరు అల్లర్ల కేసులో మిథున్ పై రెండు కేసులు నమోదయ్యాయి.. మిథున్ తో పాటు 29 మంది కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఈ కేసుల్లో విచారణ అధికారిగా ఉన్న పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ రావు ఉన్నారు. ఇప్పటికే పుంగనూరు అల్లర్ల కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు నుంచి షరతులతో కూడిన బెయిల్ పొందిన మిథున్.. ప్రతి 15 రోజులకు ఒకసారి విచారణ అధికారి ముందు హాజరు కావాలని కండిషన్ ఉంది. మూడు నెలలు వరకు అమలులో ఉన్న ఈ కండిషన్ మేరకు మిథున్ ఈ రోజు పలమనేరు డిఎస్పీ కార్యాలయానికి వచ్చారు. రెండు కేసుల్లోనూ ఏ 1 ముద్దాయిగా ఉన్న మిథున్ ఈ రోజు రెండు కేసుల్లో బెయిల్ పొందారు. ఇందులో భాగంగా జామీనుదారులతో కలిసి డీఎస్పీని ఎంపీ మిధున్ రెడ్డి కలిశారు.
పలమనేరు డీఎస్పీ కార్యాలయానికి వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వస్తున్నట్లు సమాచారం అందుకున్న వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పలమనేరుకు చేరుకున్నారు. చిత్తూరు రోడ్డులోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మిథున్ కు వైసీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అక్కడి నుంచి నేరుగా డి.ఎస్.పి కార్యాలయానికి చేరుకున్న మిథున్.. ముందస్తు బెయిల్ పై కోర్టు ఆర్డర్, కోర్టు ఉత్తర్వు మేరకు షూరిటీ లను సమర్పించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు స్టేషన్ బైయిల్ మంజూరు చేశారు విచారణ అధికారి డీఎస్పీ ప్రభాకర్ రావు..
అనంతరం మీడియాతో మాట్లాడకుండా మిథున్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మిథున్ డిఎస్పీ కార్యాలయానికి వస్తారని తెలిసి పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..