Musheer Khan: ‘ఇది నాకు పునర్జన్మ.. దేవుడికి ధన్యవాదాలు’.. కారు ప్రమాదంపై సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు

2 hours ago 2

ఇటీవల ఉత్తరప్రదేశ్ నుంచి లక్నో వెళుతుండగా టీమిండియా యంగ్ క్రికెటర్, సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. అతను ప్రయాణిస్తోన్న కారు ఆదుపుతప్పడంతో క్రికెటర్ కు మెడకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో వెంటనే అతనిని లక్నోలోని మేదాంత ఆసుపత్రిలో చేర్పించారు. ముషీర్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ వస్తోంది మేదాంత హాస్పిటల్. ప్రస్తుతం ముషీర్ ఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ఇప్పుడు, ప్రమాదం జరిగిన ఒక రోజు తర్వాత, ముషీర్ ఖాన్ స్వయంగా తన ఆరోగ్యం గురించి సమాచారాన్ని పంచుకున్నారు. కారు ప్రమాదం తర్వాత తన పరిస్థితి గురించి ముషీర్ ఖాన్ మాట్లాడుతూ, ‘నాకు ఈ కొత్త జీవితాన్ని ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. ప్రమాద సమయంలో నాతో ఉన్న నాన్న కూడా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. మీ ప్రార్థనలకు చాలా ధన్యవాదాలు.

ఇదే ప్రమాదంలో గాయపడిన ముషీర్ తండ్రి నౌషాద్ మాట్లాడుతూ.. ‘నాకు ఈ కొత్త జీవితాన్ని ఇచ్చినందుకు ముందుగా దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో, మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ, మా శ్రేయోభిలాషులకు, మా అభిమానులకు ధన్యవాదాలు. ముషీర్‌పై పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్న మా ఎంసీఏ, బీసీసీఐలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మీ ప్రార్థనలకు ధన్యవాదాలు..

కాగా ఇరానీ కప్ కోసం ముషీర్ ఖాన్ అజంగఢ్‌లోని తన ఇంటికి వచ్చారు. ఆ తర్వాత మ్యాచ్ ఆడేందుకు లక్నో వెళ్లాడు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీలో అరంగేట్రం చేసిన ముషీర్ ఖాన్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. ఈ తరుణంలో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ముషీర్ ఖాన్ గాయపడటం ముంబై జట్టుకు పెద్ద ఎదురు దెబ్బేనని భావించవచ్చు.

As per #BCCI #MusheerKhan is stable, conscious and well-oriented. He’ll beryllium flown to Mumbai for further assistance erstwhile acceptable to question . Hae volition apt instrumentality 6 months for recovery. A video of his accidental car is circulating successful media and it seems a atrocious accident. Kane Williamson pic.twitter.com/bA1TxfJXvV

— Er Amit Chaudhary (@kambojamit47) September 28, 2024

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article