Mutual Funds: ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఆ ఫండ్స్‌ కీలకం.. భారత్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ ప్రస్థానమిదే..!

2 hours ago 1

ప్రపంచంలో ఏదైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి విస్తృత భాగస్వామ్యంతో బలమైన ఆర్థిక మార్కెట్ కీలకం. అలాంటి మార్కెట్‌ను నిర్మించే దిశగా భారతదేశ ప్రయాణం మ్యూచువల్ ఫండ్‌ల పరిచయంతో ప్రారంభమైంది. పౌరుల్లో పొదుపు, పెట్టుబడిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ అద్భుతమైన వృద్ధిని సాధించింది. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయి. అయితే పెట్టుబడిదారులకు హామీ మేరకు రాబడి రాదు. పెట్టుబడుల విలువ హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ఒక్కోసారి పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టిన పూర్తి మొత్తాన్ని తిరిగి పొందే పరిస్థితి ఉండదు. భారతదేశం తన మొదటి మ్యూచువల్ ఫండ్‌ను 1963లో ప్రారంభించింది. ఈ నేపథ్యంలో భారతదేశంలో మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ వృద్ధి గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

1964-1987 మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ పునాది

భారతదేశం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ 1963లో పార్లమెంట్ చట్టం ద్వారా యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (యూటీఐ) ఏర్పాటుతో ప్రారంభమైంది. యూటీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రణ పర్యవేక్షణలో పని చేస్తుంది. 1978లో యూటీఐ ఆర్‌బీఐ నియంత్రణ నుంచి వేరు చేశారు. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రణ మరియు పరిపాలనా బాధ్యతలను చేపట్టింది. యూటీఐ ప్రారంభించిన మొదటి పథకం యూనిట్ స్కీమ్ 1964. 1988 చివరి నాటికి యూటీఐ నిర్వహణలో ఆస్తులు మొత్తం ₹6,700 కోట్లుగా ఉన్నాయి.

1987-1993 పబ్లిక్ సెక్టార్ మ్యూచువల్ ఫండ్స్ ప్రవేశం

1987లో ప్రభుత్వ రంగ బ్యాంకులు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు మార్కెట్‌లోకి ప్రవేశించడంతో ప్రభుత్వ రంగ మ్యూచువల్ ఫండ్‌లు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ యూటీఐ ఎక్స్‌టెర్నల్‌ మొదటి మ్యూచువల్ ఫండ్. ఇది జూన్ 1987లో స్థాపించారు. తర్వాత కాన్‌బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ (డిసెంబర్ 1987), పంజాబ్ నేషనల్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ (ఆగస్టు 1989), ఎల్‌ఐసీ కూడా తన మ్యూచువల్ ఫండ్‌ను జూన్ 1989లో ప్రారంభించింది. జీఐసీ డిసెంబర్ 1990లో ప్రారంభించింది. 1993 చివరి నాటికి మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఏయూఎం రూ.47,004 కోట్లకు పెరిగింది.

1993-2003 ప్రైవేట్ సెక్టార్ మ్యూచువల్ ఫండ్స్ ప్రవేశం

1992లో సెబీ ఏర్పడడం భారతీయ సెక్యూరిటీల మార్కెట్‌కు ఒక ముఖ్యమైన మైలురాయిగా మారింది. ఇది పెట్టుబడిదారులకు నియంత్రణ మరియు రక్షణను అందిస్తుంది. 1993లో సెబీ తన మొదటి మ్యూచువల్ ఫండ్ నిబంధనలను ప్రవేశపెట్టింది, ఇది ప్రైవేట్ రంగ మ్యూచువల్ ఫండ్‌లను మార్కెట్‌లోకి ప్రవేశించడానికి అనుమతించింది. కొఠారి పయనీర్, తరువాత ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌తో విలీనమైంది. ఇది జూలై 1993లో నమోదు చేసిన మొదటి ప్రైవేట్-రంగ మ్యూచువల్ ఫండ్. ఇది భారతీయ పెట్టుబడిదారులకు మరింత విభిన్నమైన మ్యూచువల్ ఫండ్ ఆఫర్‌లను అందించింది. జనవరి 2003 నాటికి పరిశ్రమలో రూ.1,21,805 కోట్ల ఏయూఎం నిర్వహించే 33 మ్యూచువల్ ఫండ్‌లు ఉన్నాయి. యూటీఐ మాత్రమే రూ.44,541 కోట్లను నిర్వహిస్తోంది.

2003-2014 పరిశ్రమ ఏకీకరణ, సవాళ్లు

ఫిబ్రవరి 2003లో యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చట్టం రద్దు చేశారు. యూటీఐ రెండు సంస్థలుగా విభజించారు. సెబీ  నిబంధనల కిందకు వచ్చిన యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, యూటీఐ మ్యూచువల్ ఫండ్ నిర్దిష్ట అండర్‌టేకింగ్‌గా మారింది. ఈ దశలో అనేక ప్రైవేట్ సెక్టార్ ఫండ్స్ విలీనం కావడంతో పరిశ్రమలో గణనీయమైన ఏకీకరణ జరిగింది. 2008-09 ప్రపంచ ఆర్థిక సంక్షోభం పరిశ్రమను ప్రతికూలంగా ప్రభావితం చేసింది, పెట్టుబడిదారుల నష్టాలకు దారితీసింది. 2009లో సెబీ ప్రవేశ భారాన్ని రద్దు చేయడం పరిశ్రమను మరింత కష్టతరం చేసింది. ఇది 2010 నుండి 2013 వరకు ఏయూఎంలో మందగమన వృద్ధిని సాధించింది.

2014 నుంచి పునరుద్ధరించిన వృద్ధి, విస్తరణ

మే 2014 నుంచి మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ వేగవంతమైన వృద్ధి దశలోకి ప్రవేశించింది, ముఖ్యంగా టైర్-II, టైర్-III నగరాల్లో పరిశ్రమ పరిధిని విస్తరించే లక్ష్యంతో సెబీ నియంత్రణ చర్యలను తీసుకుంది. ఈ కాలంలో ఏయూఎం, ఇన్వెస్టర్ ఫోలియోలు రెండింటిలోనూ గణనీయమైన పెరుగుదల కనిపించింది. మే 2014లో పరిశ్రమ ఏయూఎం రూ.10 ట్రిలియన్‌లను దాటింది. ఆగస్టు 2017 నాటికి అది రెండింతలు పెరిగి రూ.20 ట్రిలియన్‌లకు చేరుకుంది. నవంబర్ 2020 నాటికి ఏయూఎం రూ.30 ట్రిలియన్‌లను అధిగమించింది. ఆగస్ట్ 31, 2024 నాటికి భారతీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఏయూఎం 66.70 ట్రిలియన్లకు పెరిగింది. ఇది దశాబ్దంలో ఆరు రెట్లు ఎక్కువ. ఇన్వెస్టర్ ఫోలియోలు ఆగస్టు 2019లో 8.53 కోట్ల నుంచి 2024 ఆగస్టులో 20.45 కోట్లకు పెరిగాయి, గత ఐదేళ్లలో నెలవారీ సగటున 19.87 లక్షల కొత్త ఫోలియోలు జోడించారు. మ్యూచువల్ ఫండ్ పంపిణీదారులు ఈ వృద్ధిని నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article