స్టాక్ మార్కెట్ లో నేరుగా పెట్టబడి పెట్టడానికి అనుభవం లేనివారు వీటిలో డబ్బులను ఇన్వెస్ట్ చేయవచ్చు. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ అనే మూడు రకాల మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టవచ్చు. వీటి మధ్య తేాడాలు, ఇతర అంశాలను తెలుసుకుందాం. సాధారణంగా ఒక కంపెనీ విలువను స్టాక్ మార్కెట్ నిర్ణయిస్తుంది. దాని ఆధారంగా స్టాక్ మార్కెట్ లో లిస్టు చేసిన కంపెనీలను లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ లుగా నిర్ణయిస్తారు. వీటిలో మీ పెట్టుబడికి వచ్చే రాబడి.. మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక అంశాలు, ఫండ్ మేనేజర్ వ్యూహం తదితర వాటిపై ఆధార పడి ఉంటుంది.
లార్జ్ క్యాప్ ఫండ్స్
మార్కెట్ విలువ ఆధారంగా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేసిన టాప్ 100 కంపెనీలను లార్జ్ క్యాప్ కంపెనీలుగా నిర్ణయిస్తారు. వీటిలోని స్టాక్ లను కొనుగోలు చేసే మ్యూచువల్ ఫండ్స్ ను లార్జ్ క్యాప్ ఫండ్స్ అని పిలుస్తారు. బ్ల్యూచిప్ స్టాక్స్ అని పిలిచే ఈ ఫండ్స్ మంచి ట్రాక్ రికార్డు కలిగి ఉంటాయి వీటి మార్కెట్ విలువ సుమారు రూ.20 వేల కోట్లకు పైగా ఉంటుంది.
మిడ్ క్యాప్ ఫండ్స్
మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుని టాప్ 100 నుంచి 250 కంపెనీలను మిడ్ క్యాప్ కంపెనీలు అంటారు. వీటిలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్స్ ను మిడ్ క్యాప్ ఫండ్స్ అంటారు. ఈ కంపెనీల మార్కెట్ విలువ రూ.5 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకూ ఉంటుంది. మిడ్ క్యాప్ కంపెనీలకు మంచి ట్రాక్ ఉంటుంది. అయితే లార్జ్ క్యాప్ కన్నా వీటిలో పెట్టుబడులకు కొంచెం రిస్కు ఎక్కువే.
ఇవి కూడా చదవండి
స్మాల్ క్యాప్ ఫండ్స్
మార్కెట్ విలువ ఆధారంగా 251వ నంబర్ నుంచి మిగిలిన కంపెనీలను స్మాల్ క్యాప్ కంపెనీలు అంటారు. వీటి స్టాక్ లను కొనుగోలు చేేసే మ్యూచువల్ ఫండ్స్ ను స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటారు. వీటి మార్కెట్ విలువ రూ.5 వేల కోట్ల లోపు ఉంటుంది. ఈ కంపెనీలకు పెద్దగా ట్రాక్ రికార్డు ఉండదు. ఇప్పుడప్పుడే పేరు పొందుతున్న కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు ఈ విభాగంలో ఉంటాయి. స్మాల్ క్యాప్ ఫండ్స్ బుల్ మార్కెట్ లో మెరుగైన పనితీరును కనబర్చుతాయి. దీర్ఘకాలంలో అధిక రాబడి అందించే అవకాశం ఉంది. కానీ రిస్కు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. మిడ్ క్యాప్ ఫండ్స్ గ్రోత్, రిస్క్ ల మధ్య బాలెన్సుగా ఉంటాయి. మితమైన నుంచి అధిక రాబడిని స్థిరంగా అందిస్తాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్ తక్కువ రిస్కులో స్థిరమైన రాబడిని తీసుకువస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి