తమ పెళ్లిని డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకులకు అందించాలని కొత్త జంట భావించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకునేందుకు నెట్ఫ్లిక్స్తోపాటు ఓటీటీ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని తెలుస్తోంది. ఈ విషయంలో చైతన్య-శోభిత..నటి నయనతారను ఫాలో అవుతున్నారని టాక్ నడుస్తోంది. నాగచైతన్య కెరీర్.. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇబ్బందులు.. శోభితతో పరిచయం.. ప్రేమ, పెళ్లి గురించి ఇందులో చూపించనున్నారని సమాచారం. వైరల్గా మారిన ఈ కథనాలపై పలువురు నెటిజన్లు స్పందించారు. నయనతార బాటలోనే ఈ జంట కూడా అడుగులు వేస్తున్నారని అనుకుంటున్నారు. నయనతార కూడా తన పెళ్లి వీడియోను డాక్యుమెంటరీ రూపంలో విడుదల చేశారు. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’గా సిద్ధమైన ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ నవంబర్ 18 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక నాగచైతన్య-శోభితల వివాహం అన్నపూర్ణ స్టూడియోలోని తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం వద్ద తమ పెళ్లి జరగనుందని నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శోభితతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆశగా ఎదురుచూస్తున్నా. తను నన్ను బాగా అర్థం చేసుకుంది. నా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని తను పూడుస్తుందని నమ్ముతున్నా’’ అని అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.