కొత్త ఆదాయపు పన్ను చట్టం బిల్లును శుక్రవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లును దీనిని వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లు ద్వారా ఆదాయపు పన్ను విభాగాల సంఖ్యను దాదాపు మూడో వంతు తగ్గిస్తుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను చట్టాన్ని సరళంగా, మరింత సంక్షిప్తంగా చేయడానికి మేము సెక్షన్లను 25-30 శాతం తగ్గించడానికి ప్రయత్నించారని వివరిస్తున్నారు. అయితే కొత్త చట్టంలో అధికారులకు అధిక అధికారాలు ఇవ్వలేదని తెలుస్తుంది. ఆదాయాన్ని లెక్కించడం, రేట్లు విధించడం వంటి వాటికి సంబంధించిన గణనీయమైన అధికారం పార్లమెంటు వద్దనే ఉండేలా చట్టాన్ని రూపొందించారు. పార్లమెంటు ఆమోదం తర్వాత ఈ బిల్లు చట్ట రూపం వస్తుంది. ముఖ్యంగా ప్రజలకు అర్థమయ్యే సింపుల్ భాషలోనే ఈ చట్టాన్ని రూపొందించారు.
కొత్త ఆదాయపు పన్ను బిల్లులో పారదర్శకతను నిర్ధారించడానికి పన్ను చెల్లింపుదారులు, వ్యాపారాలు, నిపుణుల నుండి అభిప్రాయాన్ని సేకరించడానికి బిల్లును ప్రజా సంప్రదింపులకు పంపాలని ఆదాయపు పన్ను శాఖ కోరుతుంది. ముఖ్యంగా ఈ బిల్లును ముందుగానే ప్రజలకు అందుబాటులో ఉంచితే భవిష్యత్తులో అస్పష్టతలు లేదా చట్టపరమైన వివాదాల అవకాశాలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త బిల్లు ముసాయిదా రూపకల్పనలో 100 మందికి పైగా అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం చట్టం ఉన్న భాషలో ఉన్న అస్పష్టత కారణంగా ఉత్పన్నమయ్యే వివిధ కోర్టుల వివరణ సంబంధిత సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఈ కొత్త ఆదాయపు పన్ను బిల్లులో క్రాస్-రిఫరెన్సింగ్‌ను నివారించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి అధ్యాయానికి దాని సొంత నిర్వచనాలు ఉండవచ్చని అందువల్ల ఈ చట్టం సామాన్యులకు కూడా అర్థం అవుతుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న పన్ను చట్టం చాలా సంక్లిష్టంగా ఉంది. సరళీకృతంగా రూపొందించిన ఈ బిల్లు చట్ట రూపంలోకి వస్తే ఆదాయపు పన్ను చట్టం సామాన్యుడికి కూడా అర్థం అవుతుందని చెబుతున్నారు. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ప్రభుత్వ నిర్ణయం ఈ బిల్లు ముసాయిదాను కేవలం ఆరు నెలల్లోనే పూర్తి చేయాల్సి వచ్చిందని అదికారులు చెబుతున్నారు. కేవలం ఢిల్లీ ప్రాంతంలోని అధికారులే కాకుండా ఇతర ప్రాంతాల్లోని అధికారులు రోజులు తరబడి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి పని చేశారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..