అందాల భామ నిధి అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చిన ఈ చిన్నది ఇప్పుడు తెలుగులో క్రేజీ ఆఫర్స్ ఆ అందుకుంటుంది. యంగ్ హీరోలతో మొదలు పెట్టి ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసే రేంజ్ కు ఎదిగింది ఈ వయ్యారి భామ. నాగ చైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.తొలి సినిమా ఫ్లాప్ అయినా కూడా ఈ అమ్మడు మంచి మార్కులు కొట్టేసింది. ఆతర్వాత అక్కినేని హీరో అఖిల్ సరసన సినిమా చేసింది. అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. వరుస ఫ్లాప్స్ పలకరిస్తున్న సమయంలోనే పూరి సినిమాలో ఛాన్స్ అందుకుంది.
పూరిజగన్నాథ్ దర్శకత్వలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమా లో నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది ఈ వయ్యారి. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అభిమానులను కవ్వించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత క్రేజీ ఆఫర్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ప్రభాస్ రాజా సాబ్, పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తుంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ రెండు సినిమాల షూటింగ్స్ లో బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ ;గా మారాయి. నిధి అగర్వాల్ అంత ఈజీగా హీరోయిన్ అవ్వలేదు. ఎన్నో కష్టాలు భరించింది ఈ అమ్మడు. మొదటి సినిమా సమయంలో దాదాపు రెండేళ్లు సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగిందట. తన కష్టాల గురించి ఓ ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె చూసి తాను కూడా సినిమాల్లోకి రావాలనుకున్నా.. ఆమెను ఇన్స్పిరేషన్‌గాతీసుకున్నా.. మొదట్లో ఇంట్లో ఒప్పుకోలేదు. ఆతర్వాత నన్ను ఎంకరేజ్ చేశారు. దాదాపు రెండేళ్ల పాటు ఆఫీసుల చుట్టూ తిరిగాను. ఆఫీసుల చుట్టూ తిప్పించుకొని ఆతర్వాత అవకాశం లేదు అంటూ పంపించేశారు. మైఖేల్ మున్నా సినిమా ఆడిషన్‌కి వెళ్తే దాదాపు 300 మందిలో అదృష్టం బాగుండి నేను సెలక్ట్ అయ్యాను. ఆ సినిమా చూసి నాకు నాగ చైతన్య ‘సవ్యసాచి’లో చాన్స్ వచ్చింది అని చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి