కృష్ణ వంశీ.. టాలీవుడ్‌లో ఉన్న మేటి దర్శకులలో ఒకరు. గులాబీ, నిన్నే పెళ్లాడత, సింధూరం, అంత:పురం, మురారి, ఖడ్గం, రాఖీ, చందమామ లాంటి కల్ట్, క్లాసిక్ సినిమాలను ఆయన అందించారు. నో డౌట్ ఆయన క్రియేటీవ్ డైరెక్టర్. పాత్రలను ఎంతో అందంగా చెక్కుతారు. కాగా డైరెక్టర్ కాకముందు కృష్ణవంశీ.. ఆర్జీవీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
Krishnavamshi
కృష్ణవంశీ.. ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్తర్ గా తన సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు కృష్ణ వంశీ . ఆయన సినిమాలు వస్తున్నాయంటే చాలు ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి నెలకొంటుంది. ఎన్నో క్లాసిక్ హిట్స్ అందించారు కృష్ణవంశీ. డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు కృష్ణవంశీ. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరిర్ మొదలు పెట్టిన కృష్ణవంశీ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. గులాబీ సినిమాతో దర్శకుడిగా మారిన కృష్ణవంశీ తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు. ఆతర్వాత చాలా సూపర్ హిట్ సినిమాలు చేశారు. నాగార్జునతో నిన్నే పెళ్ళాడుతాలాంటి రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు.
సింధూరం, చంద్రలేఖ, అంతఃపురం, సముద్రం లాంటి సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఆతర్వాత మహేష్ బాబుతో మురారి సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అలాగే 2002లో ఖడ్గం సినిమాతో మరో భారీ హిట్ అందుకున్నారు. ఇలా ఆయన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన సినిమాలు తగ్గించారు. చివరిగా రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకులను పలకరించాఋ కృష్ణవంశీ. ఇదిలా ఉంటే తాజాగా కృష్ణవంశీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కృష్ణవంశీ తాజగా అభిమానులతో ముచ్చటించారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాదానాలు చెప్పారు. ఓ అభిమాని హారర్ జోనర్ లో ఓ మూవీ చేస్తే చూడాలని ఉంది అని కామెంట్ చేయగా.. నాకు కూడా హారర్ మూవీ చేయాలనీ ఉంది. వేరే లెవల్ లో ట్రై చేద్దాం. కొంచం టైం పడుతుంది అని అన్నారు. అలాగే మరో అభిమాని శ్రీ ఆంజనేయం సినిమాలో ఛార్మిని ఎందుకు అలా చూపించారు అని అడగ్గా.. తప్పేనండీ… క్షమించండి.. తీరని సమయాలు, తీరని చర్యలు, తీరని పనులు’ అంటూ రిప్లే ఇచ్చారు కృష్ణవంశీ.
Thappenandi…. Apologies.. hopeless times hopeless measures hopeless deeds 🙏🙏 https://t.co/61ZzByYkaz
— Krishna Vamsi (@director_kv) February 3, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి