తాజాగా మరో కొత్త రకం మోసం బయటపడింది. చాలా కాలంగా పెళ్లి కాకపోవడంతో మధ్యవర్తిద్వారా పెళ్లి సంబంధం కుదుర్చుకున్న యువకుడిని ఆ మధ్యవర్తి నిండా ముంచేసింది. ముహూర్తం నిర్ణయించుకుని బంధుమిత్రులతో కలిసి ఊరేగింపుగా వచ్చిన వరుడికి ఊహించని షాక్ తగిలింది. అక్కడ అసలు వధువే లేదని, ఆ ఊర్లో ఎలాంటి పెళ్లి జరగడంలేదని తెలిసి షాకయ్యాడు. హిమాచల్ ప్రదేశ్ లోని నారీ గ్రామంలో ఈ వింత మోసం చోటుచేసుకుంది. ఉనా జిల్లాలోని నారీ గ్రామానికి చెందిన ఓ 34 ఏళ్ల యువకుడు చాలా కాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఏదో ఒక కారణంతో సంబంధం కుదరడం లేదు. చివరకు దగ్గరి బంధువు రూ.50 వేలు తీసుకుని ఓ సంబంధం కుదిర్చిపెట్టింది. అమ్మాయి ఫొటో చూసిన యువకుడు మనసుపారేసుకున్నాడు. ఫోన్ లో మాట్లాడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. యువతి తొందరపెట్టడంతో హడావుడిగా ముహూర్తం నిర్ణయించి పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేసుకున్న యువకుడు.. ముహూర్త సమయానికి బంధుమిత్రులతో కలిసి యువతి స్వస్థలం సింగా గ్రామానికి ఊరేగింపుగా బయలుదేరి వెళ్లాడు. అయితే, ఈ బృందాన్ని చూసి సింగా గ్రామస్థులు ఆశ్చర్యపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భూమ్మీద నరకం.. ఆ జైలు.. అక్రమ వలసదారులను అక్కడికే
శాంతించిన బంగారం.. గోల్డ్ ధర ఎంతో తెలుసా ??
Jio: రెండు పాపులర్ రీఛార్జ్ ప్లాన్లను ఎత్తేసిన జియో