PAK vs ENG 1st Test: ముల్తాన్‌లో పాక్ ఘోర పరాజయం.. కట్‌చేస్తే.. 147 ఏళ్లలో తొలిసారి చెత్త రికార్డ్

2 hours ago 1

Pakistan vs England, 1st Test: తొలి ఇన్నింగ్స్‌లో 550కి పైగా పరుగులు చేసినప్పటికీ, టెస్టు చరిత్రలో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన తొలి జట్టుగా పాకిస్థాన్ నిలిచింది. శుక్రవారం ముల్తాన్‌లోని ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత, పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందుకు ధీటుగా స్పందించిన ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్లకు 823 లకు డిక్లెర్ చేసింది.

 ముల్తాన్‌లో పాక్ ఘోర పరాజయం.. కట్‌చేస్తే.. 147 ఏళ్లలో తొలిసారి చెత్త రికార్డ్

Pak Vs Eng 1st Test

|

Updated on: Oct 11, 2024 | 12:34 PM

Pakistan vs England, 1st Test: తొలి ఇన్నింగ్స్‌లో 550కి పైగా పరుగులు చేసినప్పటికీ, టెస్టు చరిత్రలో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన తొలి జట్టుగా పాకిస్థాన్ నిలిచింది. శుక్రవారం ముల్తాన్‌లోని ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత, పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందుకు ధీటుగా స్పందించిన ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్లకు 823 లకు డిక్లెర్ చేసింది.

267 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాకిస్థాన్ జట్టు 220 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో స్వదేశంలో మరో ఓటమి చవిచూసింది. స్వదేశంలో ఆడిన చివరి 11 టెస్టుల్లో ఏడు పరాజయాలతో పాకిస్థాన్ చెత్త రికార్డ్‌ను నమోదు చేసింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లిష్‌ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మైదానంలో అక్టోబర్ 15 నుంచి సిరీస్‌లో రెండో టెస్టు జరగనుంది.

పాక్ జట్టు పేరుతో నమోదైన చెత్త రికార్డులు..

  1. టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఓ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 500+ పరుగులు చేసి ఓడిపోయింది.
  2. గత 44 నెలలుగా పాకిస్థాన్ ఏ టెస్టు మ్యాచ్‌లోనూ గెలవలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article