Pariksha Pe Charcha 2025: ఫిబ్రవరి 10న పరీక్షా పే చర్చ.. ఆహ్వానం పలికిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

3 hours ago 1

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: విద్యార్ధుల్లో పరీక్షల భయం పోగెట్టేందుకు పరీక్షల సీజన్‌లో ప్రధాన మంత్రి మోదీ ఏటా పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 10వ తేదీన ఢిల్లీలోని భారత్‌ మండపం టౌన్‌ హాల్‌లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ ఇన్విటేషన్ పలికారు. ‘పరీక్షల సీజన్ తిరిగి వచ్చేసింది. పరీక్షా పే చర్చ ఈ ఏడాది కూడా మీ ముందుకొస్తుంది. అయితే ఈ సారి పరీక్షా పే చర్చ 2025 కార్యక్రమాన్ని కొత్త ఫార్మాట్‌లో సరికొత్తగా నిర్వహిస్తున్నాం. ప్రధాని మోదీ విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు, పరీక్షల ఆందోళన, ఒత్తిడిని అధిగమించడంలో సహాయపడటానికి అనుకూల చిట్కాలతో తిరిగి మీ ముందుకు వస్తున్నారు. పరీక్ష పే చర్య కార్యక్రమానికి విద్యార్ధులను, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను స్వాగతిస్తున్నా. రండి.. ప్రధాని మోడీతో కలిసి ఒత్తిడిని తగ్గించుకుందాం. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 10న ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతుంది’ అని తన ఎక్స్ ఖాతాలో వీడియో పోస్టులో మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అందరికీ ఆహ్వానం పలికారు.

కాగా ఈ ఏడాది ప్రధాని మోదీతో పాటు పరీక్ష పే చర్చ 2025 కార్యక్రమానికి బాలీవుడ్‌ నటీనటులు, ఇతర రంగాల ప్రముఖులు కూడా ఇందులో పాల్గోనున్నట్లు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. వీరిలో సద్గురు జగ్గీ వాసుదేవ్‌, బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె, 12th ఫెయిల్ నటుడు విక్రాంత్‌ మస్సే, భూమి పడ్నేకర్‌, దిగ్గజ బాక్సర్‌ మేరీ కోమ్‌, పారా అథ్లెట్‌ అవని లేఖరా, రచయిత రుజుతా దివేకర్‌, ఎడెల్‌వీస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈఓ రాధికా గుప్తా, మానసిక నిపుణురాలు సోనాలీ సబర్వాల్‌, ఫుడ్‌ ఫార్మర్‌ రేవంత్‌ హిమత్‌సింగ్కా, టెక్నికల్‌ గురూజీ గౌరవ్‌ చౌధరీ వంటి ఎందరో ప్రముఖులు ఈ కార్యక్రమంలో కనిపించనున్నారు. ఈ పాడ్‌కాస్ట్‌ ఎపిసోడ్‌లో వీరు తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకుని వారిలో స్ఫూర్తి నింపేందుకు వస్తున్నారు.

ఇవి కూడా చదవండి

The exam play is back. And, truthful is Pariksha Pe Charcha. And, this clip successful an altogether caller and refreshing avatar.

PM @narendramodi ji is backmost with his pro-tips to assistance spirits and assistance students flooded exam anxiousness and stress. I invited #ExamWarriors, parents and teachers… pic.twitter.com/HJF8d2Qyim

— Dharmendra Pradhan (@dpradhanbjp) February 6, 2025

పరీక్షా పే చర్చ కార్యక్రమానికి డిసెంబర్‌ 14 నుంచి జనవరి 24 ఉదయం 10గంటల వరకు రిజిస్ట్రేషన్లు స్వీకరించగా.. దేశవ్యాప్తంగా 9.72 లక్షల మంది విద్యార్థులు, 1.01లక్షల మంది టీచర్లు, 24,289 మంది తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరిని వడపోసిన అనంతరం ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు 2500 మందిని ఎంపిక చేశారు. పరీక్షా పే చర్చలో పాల్గొనేవారిని ఎంపిక చేసేందుకు ఆన్‌లైన్ మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలతో ఓ పరీక్ష నిర్వహిస్తారు. అందులో ప్రతి కనబరచిన విద్యార్థులు ప్రధానితో నేరుగా జరిగే చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి అర్హత సాధిస్తారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వడమే కాకుండా విద్యార్థులకు తగిన సూచనలు, చిట్కాలు చెబుతారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article