అకీరా నందన్.. హీరోగా ఎప్పుడెప్పుడు అరంగేట్రం చేస్తాడా ? అని ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అకీరా పేరు మారుమోగుతుంది. అలాగే తన కొడుకు ఫోటోస్, వీడియోస్ ఎప్పటికప్పుడు నటి రేణు దేశాయ్ షేర్ చేయగా.. క్షణాల్లో నెట్టింట వైరలవుతుంటాయి. ఇక ఇప్పుడు అకీరా నందన్ న్యూలుక్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అకీరా ఫుల్ గడ్డం, జుట్టు బాగా పెంచుకుని పంచ, కుర్తా సెట్లో కనిపించారు. అసలు విషయానికి వస్తే.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన కుమారుడు అకిరా నందన్‌తో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్లారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్యక్షేత్రాలు దర్శించుకునే యాత్రకు నేడు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ముందు కేరళ వెళ్లి కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు.
ఆ ఆలయంలో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరాతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్షేత్ర సందర్శనలో పవన్ కళ్యాణ్ తోపాటు ఆయన తనయుడు అకీరా నందన్, టీటీడీ సభ్యుడు ఆనందసాయి సైతం పాల్గొన్నారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అటు జనసేన సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా పవన్, అకీరా అగస్త్య మహర్షి ఆలయంలో ప్రదక్షిణలు , పూజలు చేసిన వీడియోను అధికారికంగా షేర్ చేశారు. చాలా రోజుల తర్వాత పవన్, అకీరా నందన్ కలిసి ఉన్న ఫోటోస్ చూసి మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అయితే ఈ ఫోటోలలో అకీరా లుక్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఫుల్ గడ్డం, జుట్టు పెంచుకుని.. తండ్రిలాగే పంచ, కుర్తా వేసుకుని సరికొత్త లుక్ లో కనపడ్డాడు. దీంతో అకీరా లుక్ అదిరింది.. సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు..తండ్రికి తగ్గ తనయుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే లుక్ లో అకీరా హీరోగా ఎంట్రీ ఇస్తే.. అదిరిపోతుందని అంటున్నారు. ప్రస్తుతం అకీరా న్యూస్ లుక్ ఫోటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన