PM Narendra Modi: ‘ అసలు నిజం బయటకు వస్తోంది’.. రాశీఖన్నా సినిమాపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు

2 hours ago 1

గోద్రా రైలు దుర్ఘటన నేటికీ వివాదాస్పదంగానే మిగిలిపోయింది. 2002లో జరిగిన ఆ ఘటన తర్వాత గుజరాత్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ఇప్పటికే చాలా డాక్యుమెంటరీలు వచ్చాయి. ఇప్పుడు ఇదే ఘటనపై బాలీవుడ్‌లో ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమా విడుదలైంది . ఇందులో 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాస్సే, టాలీవుడ్ హీరోయిన్ రాఖీ ఖన్నా, రిద్ది డోగ్రా, బర్కా సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. ధీరజ్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఏక్తా కపూర్ నిర్మాతగా వ్యవహరించింది. శుక్రవారం (నవంబర్ 15)న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గోద్రా మారణకాండ జరిగినప్పుడు జరిగిన ఘటనను మీడియా ఎలా చిత్రీకరించిందనే ప్రధాన ఇతివృత్తంతో ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఈ సినిమాని ఉద్దేశించి ఒక నెటిజన్‌ పెట్టిన పోస్ట్‌పై ట్విట్టర్ వేదికగా స్పందించిన మోడీ.. ‘కల్పిత కథనాలు పరిమిత కాలమే కొనసాగుతాయి. సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

2002 గోద్రా రైలు ఘటన అందరినీ కలిచివేసింది. ఈ ఘటనలో మహిళలు, పిల్లలతో సహా సుమారు 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటన తర్వాత గుజరాత్ లో మతకల్లహాలు చెలరేగాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పుడిదే ఘటన ఆధారంగా ది సబర్మతీ రిపోర్ట్ ను తెరకెక్కించారు ధీరజ్ శర్మ. నవంబర్ 15న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ఇప్పుడు స్వయంగా ప్రధాని మోడీనే ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడంతో వసూళ్లు మరింతగా పెరిగే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్..

Well said. It is bully that this information is coming out, and that excessively successful a mode communal radical tin spot it.

A fake communicative tin persist lone for a constricted play of time. Eventually, the facts volition ever travel out! https://t.co/8XXo5hQe2y

— Narendra Modi (@narendramodi) November 17, 2024

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article