యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భోజన ప్రియుడు అన్న సంగతి తెలిసిందే. ఇంటికి వచ్చిన అతిథులకే కాకుండా సినిమా షూటింగ్ సెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి నుంచి భోజనం పంపిస్తారు. అక్కడ ఉన్న వారందరికీ భోజన ఏర్పాట్లను ప్రభాసే చూసుకుంటారు. ఇప్పటికే డార్లింగ్ ఆతిథ్యం గురించి సినీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు, హీరోయిన్స్ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ తన టీమ్ మొత్తానికి ఆతిథ్యమివ్వడం మాత్రం వదిలిపెట్టలేదు. ప్రభాస్ ఇంటి నుంచి వచ్చే భోజనం గురించి టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ మాత్రమే కాకుండా బాలీవుడ్ స్టార్స్ సైతం తెగ పొగిడేశారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ఇమాన్వీకి డార్లింగ్ ఇంటి భోజనం పంపించారు. ఇదే విషయాన్ని చెబుతూ డార్లింగ్ పంపించిన భోజనాన్ని వీడియో షేర్ చేసింది ఇమాన్వీ.
ప్రభాస్ పంపించిన భోజనం చాలా బాగుంది అంటూ చెప్పుకొచ్చింది. సీతారామం సినిమాతో హిట్టు కొట్టిన డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా కొన్ని నెలలుగా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై ఎలాంటి క్లారిటీ రాలేదు.
ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో వస్తున్న ఈ సినిమాలో ఇమాన్వీ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. అంతకు ముందు ఇన్ స్టాలో రీల్స్ డ్యాన్స్ వీడియోస్ చేసి చాలా ఫేమస్ అయ్యింది ఇమాన్వీ. ఇన్ స్టాలో ఆమెకు చాలా ఫాలోయింగ్ ఉంది. అలాగే క్లాసికల్ డ్యాన్స్ ట్రైనింగ్ ఇస్తుంది ఇమాన్వీ. నెట్టింట ఆమె చాలా పాపులర్ కావడంతో ప్రభాస్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు మేకర్స్. ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోతో తొలి ప్రాజెక్ట్ కావడం విశేషం. కొత్త హీరోయిన్లకు సైతం ప్రభాస్ ఆతిథ్యం ఇవ్వడం ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..