RCB Retention List: బయటికొచ్చిన ఆర్సీబీ రిటెన్షన్‌ లిస్ట్‌.. ఈ సాలా కప్ ఆర్సీబీదేనా..?

1 hour ago 1

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఇప్పటి వరకు ఒక్క కప్‌ను సొంతం చేసుకోలేకపోయింది. ఈ సారి ఎలాగైనా కప్ కొట్టాలని ఆర్‌సీబీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో మెగా వేలానికి ముందు, ఫ్రాంచైజీ అంతుచిక్కని తొలి టైటిల్ కోసం తమ ఛేజింగ్‌ను కొనసాగిస్తున్నందున కీలక ఆటగాళ్లను నిలుపుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది.

 బయటికొచ్చిన ఆర్సీబీ రిటెన్షన్‌ లిస్ట్‌.. ఈ సాలా కప్ ఆర్సీబీదేనా..?

Rcb Retention Players List

|

Updated on: Oct 28, 2024 | 12:05 PM

RCB మాజీ కెప్టెన్ IPL ప్రారంభం నుంచి ఆ ఫ్రాంచైజీతో ఉన్నాడు. అతను 15 మ్యాచ్‌లలో 154 స్ట్రైక్ రేట్‌తో 741 పరుగులతో గత సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు. అందరీకి తెలిసిందే ఆర్సీబీ అంటే విరాట్.. విరాట్ అంటే ఆర్సీబీ అందులో డౌటే లేదు.. మొదట కోహ్లీని ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంటుంది. మహ్మద్ సిరాజ్, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, యష్ దయాల్ (అన్‌క్యాప్‌డ్) లను రిటైన్ చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది.

గ్లెన్ మాక్స్‌వెల్ గత ఐపీఎల్ సీజన్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. మాక్స్‌వెల్ మునుపటి ఎడిషన్‌లో 10 మ్యాచ్‌లలో 52 పరుగులు మాత్రమే చేసి పరుగులు రాబట్టడానికి ఇబ్బంది పడ్డాడు. అతను మునుపటి మూడు సీజన్లలో RCB కోసం నిలకడగా 300+ పరుగులు చేసినప్పటికీ, IPL 2024లో అతని ఆటలో ఏదో మిస్ అయినంటూ అనిపించింది. అయితే ఈ సిజన్‌లో గ్లెన్ మాక్స్‌వెల్‌పై ఆర్సీబీ వదులుకోవడానికి సిద్ధంగా లేదని తెలుస్తుంది. అతని రిటైన్ చేసుకోబోతున్నట్లు సమాచారం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article