జనగామ పట్టణంలోని జయ, శ్రీలక్ష్మి షాపింగ్ మాల్స్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 24 గంటలు గడిచినా మంటలు అదుపులోకి రాలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విజయ, శ్రీలక్ష్మి షాపింగ్ మాల్స్ పూర్తిగా దగ్ధమైయ్యాయి.
Huge Fire Accident
జనగామ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం జనగామ పట్టణంలోని జయ, శ్రీలక్ష్మి షాపింగ్ మాల్స్‌లో మంటల రేగాయి. 24 గంటలు గడిచినా మంటలు అదుపులోకి రాలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విజయ, శ్రీలక్ష్మి షాపింగ్ మాల్స్ పూర్తిగా దగ్ధమైయ్యాయి. నిన్నటి నుండి ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతునే ఉన్నారు. ఆదివారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం ఈరోజు ఉదయం వరకు మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పే యత్నం చేస్తున్నారు. షాపింగ్ మాల్ వెనక గోడలను బదలుగొట్టి మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ఐదు ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు. రు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. సమయానికి ఫైర్ సిబ్బంది మాటలు అర్పడంతో చుట్టుపక్కల షాపుల వారు ఊపిరి పీల్చుకున్నారు.