భారత మాజీ క్రికెటర్ సాయిరాజ్ బహుతులే ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్‌లో స్పిన్ బౌలింగ్ కోచ్‌గా చేరనున్నారు. 2018 నుంచి 2021 వరకు ఈ ఫ్రాంచైజీతో పనిచేసిన సాయిరాజ్ బహుతులే, ఇటీవల బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) నుండి తన పదవికి రాజీనామా చేశారు. రాజస్థాన్ రాయల్స్‌లో అతను న్యూజిలాండ్‌కు చెందిన బౌలింగ్ కోచ్ షేన్ బాండ్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌లతో కలిసి పనిచేయనున్నారు. ప్రస్తుతం “సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్”గా పిలువబడుతున్న సంస్థ నుంచి తన పదవికి రాజీనామా చేశారు.
సాయిరాజ్ బహుతులే క్రిక్‌బజ్‌కు మాట్లాడుతూ, “ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయన్న సాయిరాజ్.. ఈ విషయంపై మాట్లాడుతూ, ” నేను త్వరలోనే నా బాధ్యతలను ఖరారు చేయనున్నాను. కొన్ని విషయాలు ఇంకా అంగీకరించాల్సి ఉంది, కానీ రాయల్స్‌తో తిరిగి కలవడంపై చాలా ఉత్సాహంగా ఉన్నాను” అని తెలిపారు. “రాహుల్ ద్రవిడ్‌తో మళ్లీ పని చేయడం ఆనందంగా ఉంది. 2023 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో భారత జట్టులోకి నన్ను పరిచయం చేసిన వ్యక్తి ఆయనే. శ్రీలంక టూర్ సమయంలో కూడా ఆయన కోచింగ్ స్టాఫ్‌లో నేను ఉన్నాను, కాబట్టి మళ్లీ కలవడం ఆసక్తికరంగా ఉంటుంది.”
సాయిరాజ్ బహుతులే (52) తన కెరీర్‌లో రెండు టెస్టులు, ఐదు వన్డేలు ఆడారు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఆకాష్ మధ్వాల్, ఫజల్హక్ ఫరూకీ వంటి బౌలర్లు ఉన్నారు. శ్రీలంక స్పిన్నర్లు మహీష్ తీక్షణ, కుమార్ కార్తికేయ, వనిందు హసరంగలతో సహా సాయిరాజ్ బహుతులే సంవత్సరం పొడవునా జట్టులోని బౌలర్లతో పని చేయనున్నారు.
ఇంగ్లండ్ వంద బంతుల క్రికెట్ లీగ్ “ది హండ్రెడ్” టోర్నమెంట్‌లో Trent Rockets జట్టును కొనుగోలు చేయడానికి రాజస్థాన్ రాయల్స్ ఓనర్ మనోజ్ బడాలే ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ & వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో ఇప్పటికే ఆరుగురు కొత్త జట్టు యజమానులను ఎంపిక చేశారు, ఇంకా Southern Brave, Trent Rockets జట్లను అమ్మాల్సి ఉంది. మనోజ్ బడాలే ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో Barbados Royals, దక్షిణాఫ్రికా SA20 లీగ్‌లో Paarl Royals జట్టును కలిగి ఉన్నారు. Trent Rockets కొనుగోలుకు ఐపీఎల్‌లోని మరికొన్ని ఫ్రాంచైజీలు మరియు ప్రైవేట్ ఇక్విటీ సంస్థలు పోటీ పడతాయని సమాచారం. ఈ బిడ్డింగ్ ఇ-ఆక్షన్ ద్వారా నిర్వహించబడుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..