బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటనతో ముంబై ఒక్కసారిగా ఊలిక్కిపడింది. కొన్ని నెలలుగా బీటౌన్ స్టార్ హీరోలకు హత్య బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. అదే సమయంలో సైఫ్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సైతం రంగంలోకి దిగారు. మరోవైపు దాడి ఘటన తర్వాత సైఫ్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. జనవరి 16న ఆసుపత్రిలో చేరగా.. శస్త్ర చికిత్స అనంతరం సైఫ్ బాడీ నుంచి రెండున్నర అంచుల కత్తిని తొలగించారు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. అయితే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్‌కి సలహా ఇచ్చారు.
సైఫ్ డిశ్చార్జ్ అయ్యేందుకు వైద్యులు అనుమతి ఇచ్చారు. అయితే అతడిని ఎప్పుడు ఇంటికి తీసుకెళ్లాలనేది నటుడి కుటుంబం నిర్ణయిస్తుంది. సైఫ్ ప్రస్తుతం నడవగలడని.. మాట్లాడగలడని.. కానీ పూర్తిగా కోలుకోవడానికి ఒక నెల టైమ్ పడుతుందని డాక్టర్స్ అన్నారు. సైఫ్ వెన్నుముకకు ప్లాస్టిక్ సర్జరీ జరగడంతో.. అతడు పూర్తిగా కోలుకోవడానికి ఒక నెల సమయం పడుతుందని సమాచారం. సైఫ్‌కి పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, బరువు ఎత్తడం, వ్యాయామం చేయడం, షూటింగ్‌లు చేయడం మానుకోవాలని వైద్యులు సూచించారు. సైఫ్ గాయాలు ఇంకా మానలేదు. దీంతో అతడు మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి. లేదంటే గాయాలు మానకపోతే ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని.. అందుకే తన కుటుంబ సభ్యులు కలవడానికి సైతం వైద్యులు అంగీకరించలేదని సమాచారం.
సైఫ్ అలీఖాన్‌పై దాడి తర్వాత, అతని సొసైటీ బాల్కనీలో ప్రస్తుతం నెట్‌ని అమర్చారు. దాడి తర్వాత ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. నివేదికల ప్రకారం సైఫ్ ఆ ఇంటి నుంచి మరో ఇంటికి మారాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారట. అలాగే తన కొత్తింటికి భారీ భద్రతను ఏర్పాటు చేయాలని చూస్తున్నారట.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..