బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు గత కొన్ని నెలలుగా హత్య బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్సీపీ నేత బాబా సిద్ధీఖి హత్య తర్వాత ఇలాంటి బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయి. తాజాగా సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపు వచ్చినట్లు సమాచారం. సల్మాన్ తమకు క్షమాపణ చెప్పాలని.. లేదంటే చంపేస్తామని ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగానికి బెదిరింపు లేఖ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందేశం లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు పంపినట్లుగా పోలీసులు సందేహిస్తున్నారు. సమాచారం ప్రకారం ముంబై పోలీసుల ట్రాఫిక్ కంట్రోల్ సెల్‌కు నిన్న రాత్రి బెదిరింపు కాల్ వచ్చింది. ఈసారి బెదిరింపు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో బెదిరింపు సందేశం వచ్చింది.
సల్మాన్ ఖాన్ బతికి ఉండాలంటే మా గుడికి వచ్చి క్షమాపణ చెప్పాలని లేదంటే 5 కోట్ల రూపాయలు చెల్లించాలని.. లేదంటే చంపేస్తామని సదరు వ్యక్తి బెదిరించినట్లు సమాచారం. తమ గ్యాంగ్ ఇప్పటికీ యాక్టివ్‌గా ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. ముంబై పోలీసుల ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు సందేశం రావడంతో వర్లీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కొనసాగుతోంది. వారం రోజుల్లో సల్మాన్ ఖాన్‌కు రెండుసార్లు హత్య బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు బెదిరించిన వ్యక్తి కోసం ముంబై పోలీసులు వెతుకుతున్నారు.
1998లో సల్మాన్ ఖాన్ కృష్ణజింకను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. బిష్ణోయ్ కమ్యూనిటీ కృష్ణజింకను దైవంగా భావిస్తుంది. దీంతో సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ నుంచి పదే పదే హత్య బెదిరింపులు వస్తున్నాయి. ఏప్రిల్ 14న బాంద్రాలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్మెంట్ వెలుపల షూటింగ్ జరిగింది. అలాగే సల్మాన్ ఖాన్‌కు సన్నిహితుడైన ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని దసరా రోజున హత్య చేశారు. ఈ రెండు ఘటనల వెనుక బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. మరోవైపు సల్మాన్ ఖాన్ కు పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.
ఇది చదవండి : Tollywood : అదృష్టం కలిసిరాని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?
Dandupalyam Movie: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దండుపాళ్యం హీరోయిన్ను చూస్తే షాకవ్వాల్సిందే..
Tollywood: నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు.. ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్.. చివరకు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.