భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగు మ్యాచ్ ల టీ20 సిరీస్‌లో భాగంగ చివరి మ్యాచ్ శుక్రవారం (నవంబర 15) జోహన్నెస్‌బర్గ్‌లో జరిగింది. ఈ మ్యాచ్ ద్వారా సిరీస్ భవితవ్యం తేలాల్సి ఉండగా అందులో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. గత రెండు మ్యాచ్‌ల్లో సున్నాకే అవుటైన నిరాశను మిగిల్చిన ఈ భారత ఓపెనర్ మళ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దక్షిణాఫ్రికా బౌలర్లను చితగ్గొట్టి మెరుపు సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ గా రంగంలోకి దిగిన శాంసన్ కేవలం 56 బంతుల్లో 9 సిక్సర్లు, 6 ఫోర్లతో అజేయంగా 109 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ కొట్టిన ఒక బంతి నేరుగా వెళ్లి ఒక అమ్మాయి ముఖానికి తగిలింది. దీంతో బాధతో ఆ యువతి కాసేపు విలవిల్లాడిపోయింది. ఇది గమనించిన సంజూ శాంసన్ కూడా మైదానం నుంచి చేయి పైకెత్తి క్షమాపణలు కూడా చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.
భారత ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. పార్ట్ టైమ్ స్పిన్నర్ ట్రిస్టన్ స్టబ్స్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు సంజూ శాంసన్. అయితే అందులో ఒక బంతి స్టాండ్స్‌లో నిర్మించిన రెయిలింగ్‌కు డైరెక్ట్ గా తగిలింది. ఆ తర్వాత బౌన్స్ అయ్యి గ్యాలరీలో ఉన్న అమ్మాయి దవడకు బలంగా తగిలింది. దీంతో ఆ లేడీ ఫ్యాన్ నొప్పిని భరించలేక ఏడ్చేసింది. ఆమెకు వెంటనే ఐస్ ప్యాక్ ట్రీట్ మెంట్ ఇచ్చారు. దీంతో ఆ అమ్మాయి ఏడుపు ఆపింది. కాగా తాను కొట్టిన బంతికి అమ్మాయి గాయపడినట్లు తెలియగానే సంజూ వెంటనే క్షమాపణలు కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
వీడియో ఇదిగో…
Wishing a speedy betterment for the injured fan! 🤕🤞
Keep watching the 4th #SAvIND T20I LIVE connected #JioCinema, #Sports18 & #ColorsCineplex 👈#JioCinemaSports pic.twitter.com/KMtBnOa1Hj
— JioCinema (@JioCinema) November 15, 2024
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 283 పరుగులు చేసింది. సంజు మాత్రమే కాదు, మూడో స్థానంలో వచ్చిన తిలక్ వర్మ కూడా వరుసగా రెండో మ్యాచ్‌లో అద్భుత సెంచరీ సాధించాడు. తిలక్ 41 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి, సంజుతో కలిసి 210 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు, దీంతో టీమ్ ఇండియా 283 పరుగులు చేసింది. ఈ కఠినమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 18.2 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత జట్టు 135 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో నాలుగు టీ20ల సిరీస్‌ను భారత జట్టు 3-1 తేడాతో కైవసం చేసుకుంది.
#TeamIndia seal bid triumph successful benignant yet again! 🏆🇮🇳#SAvIND #JioCinema #Sports18 #ColorsCineplex #JioCinemaSports pic.twitter.com/rvablJshgs
— JioCinema (@JioCinema) November 15, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..