సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేశ్ సంక్రాతికి వస్తున్నాం సినిమాలకు మంచి స్పందన వచ్చింది. అయితే గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలు కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్స్.. కానీ వెంకీ సంక్రాంతికి వస్తున్నాం మాత్రం టోటల్లీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అందుకే జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ వచ్చింది.
Sankranthiki Vasthunam
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 14న విడుదలై సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో వెంకటేష్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులచేత నవ్వులు పూయించారు. అలాగే వెంకటేష్ కు జోడిగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. తొలి షో నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో మూవీ టీమ్ మొత్తం ఆనందంలో తేలిపోతున్నారు.
ఇది కూడా చదవండి : క్రికెటర్‌తో ఎఫైర్.. ఫ్రెండ్ భర్తతో ఆ యవ్వారం.. పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్.. ఎవరో తెలుసా.?
ఇప్పటికే ఈ సినిమా రూ. 300కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాలో ముఖ్యంగా వెంకటేష్ తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే ఐశ్వర్య రాజేష్ కూడా తన నటనతో అలరించింది. అనిల్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
ఇది కూడా చదవండి :ఆ హీరో ఎందుకూ పనికిరాడని వాళ్ల నాన్న తెగ బాధపడ్డాడు.. ఇంతకీ అతను ఎవరంటే
తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీ రిలీజ్ కన్ఫార్మ్ అయ్యింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ రేటు సంక్రాంతికి వస్తున్నాం సినిమా రైట్స్ ను జీ 5 కొనుగోలు చేసిందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. ఇక ఈ సినిమా నైజంలో నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా నైజాంలో దాదాపు 40 కోట్ల లాభం వచ్చిందంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి