ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ హైదరాబాద్‌లో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించనున్నాడు. ఫిబ్రవరి 15న ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను మూవ్78 లైవ్ సంస్థ ప్లాన్ చేసింది. ఈ కాన్సర్ట్ విశేషాల్ని తెలియజేసేందుకు మూవ్78 లైవ్ సంస్థ సీఈవో నితిన్ కనకరాజ్, సింగర్ సిధ్ శ్రీరామ్ మీడియా ముందుకు వచ్చారు. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో.. సింగర్ సిధ్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘గత పదేళ్ల నుంచి తెలుగు ఆడియెన్స్ ఎంతో ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. నాకు తెలుగులోనే ఎక్కువ మంది అభిమానులున్నారు. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ చేశాను. మళ్లీ ఇప్పుడు చేయబోతోన్నాం. ఈ కాన్సర్ట్‌లో నా పాటలతో పాటుగా 80, 90వ దశకంలో వచ్చిన మెలోడీ పాటల్ని కూడా పాడతాను. నేను ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నాను. నాకు ఓ ఏడాది టైం ఇవ్వండి తెలుగులో ఫ్లూయెంట్‌గా మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను’ అని అన్నారు.
నితిన్ కనకరాజ్ మాట్లాడుతూ.. ‘సిధ్ శ్రీరామ్‌తో మూడేళ్ల తరువాత మళ్లీ హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నాం. ఫిబ్రవరి 15న ఈ ఈవెంట్‌ను నిర్వహించబోతోన్నాం. ఈ కాన్సర్ట్ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం, యూత్ కోసం ఏర్పాటు చేస్తున్నాం.నాకు పర్సనల్‌గా సిధ్ శ్రీరామ్ అంటే చాలా ఇష్టం. ఈ జనరేషన్‌కు సిధ్ అంటే చాలా ఇష్టం. ఈ ఈవెంట్, లైవ్ కాన్సర్ట్ అద్భుతంగా ఉండబోతోంది. గ్రూపుగా టికెట్లు బుక్ చేసుకుంటే డిస్కౌంట్ కూడా ఉంటుంది’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
డిస్కౌంట్ లో టికెట్లు..
VIDEO | “The signifier volition conscionable beryllium maine and the songs. The personage is going to beryllium music. I anticipation that immoderate of my friends successful the fraternity travel to spot the amusement and let’s spot what happens,” says vocalist Sid Sriram connected his unrecorded performance which is scheduled connected February 15 successful Hyderabad.… pic.twitter.com/PFviNPvatA
— Press Trust of India (@PTI_News) January 20, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.