ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బాహుబలి సినిమా దగ్గర నుంచి ప్రభాస్ స్పీడ్ పెంచాడు. మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా ప్రభాస్ స్పీడ్ ఎక్కడా తగ్గించలేదు. ఇక రీసెంట్ గా సలార్, కల్కి సినిమాతో వరుసగా పాన్ ఇండియా హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు వరుసగా రాజా సాబ్, సలార్ 2, కల్కి 2, స్పిరిట్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో మారుతి దర్శకత్వంలో రాబోతున్న రాజా సాబ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నాడు. హారర్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. డిఫరెంట్ కథతో మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ స్టైలిష్ లుక్స్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చాయి. అలాగే ప్రభాస్ ఓల్డ్ లుక్ కూడా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో నిధి అగర్వాల్, తమిళ్ బ్యూటీ మాళవికామోహన్ జాయిన్ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా రాజా సాబ్ సినిమా నుంచి ఓ వీడియోలు లీక్ అయ్యిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియోలో మాళవికామోహన్ ఫైట్ చేస్తూ కనిపించింది. అయితే ఈ వీడియో రాజా సాబ్ సినిమాలోది అని కొంతమంది సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. దీని పై ఇప్పటివరకు చిత్రయూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా ఈ సీన్ రాజాసాబ్ సినిమాలోది కాదు అని కొందరు అంటున్నారు. మాళవిక మోహన్ రాజాసాబ్ సినిమాతో పాటు తమిళ్ లోనూ ఓ సినిమా చేస్తుంది. అదే సర్ధార్ 2. కార్తీ హీరోగా నటించిన సర్దార్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు సర్ధార్ 2 సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో మాళవిక రా ఏజెంట్ గా నటిస్తుంది. ఆ వీడియో సర్ధార్ 2 షూటింగ్ నుంచి లీక్ అయ్యి ఉండొచ్చు అని అంటున్నారు కొందరు. దీని పైన క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వార్త విని ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో అదిరిపోయే సర్‌ప్రైజ్ లు ఉంటాయి. వాటిని థియేటర్స్ లోనే చూసి ఎంజాయ్ చేస్తాం అంటున్నారు ఫ్యాన్స్.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.