Sikandrabad Cylinder Blast: తీరని విషాదం.. సిలిండర్‌ పేలి.. ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి

2 hours ago 1

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బులంద్‌షహర్‌లోని సికిందరాబాద్‌లో ఓ ఇంట్లో సిలిండర్‌ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. భారీ పేలుడు శబ్ధంతో ఆ ప్రాంతంలోనివారంతా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. శిథిలాల నుంచి ఇప్పటి వరకు ఐదు మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. శిథిలాల కింద మరికొందరు ఉండవచ్చని స్థానికులు అంటున్నారు.

ఈ మేరకు బులంద్‌షహర్ జిల్లా మేజిస్ట్రేట్ చంద్రప్రకాశ్ సింగ్ మీడియాలో మాట్లాడారు.. ఈ ఘటనలో ఐదుగురు మరణించారని చెప్పారు. ఆశాపురి కాలనీలోని ఒక ఇంట్లో రాత్రి 8:30-9 గంటల ప్రాంతంలో గ్యాస్‌ సిలిండర్ పేలుడు సంభవించినట్టుగా సమాచారం అందిందని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందజేస్తున్నట్టుగా వెల్లడించారు. ఇంట్లో మొత్తం 18 నుంచి19 మంది వరకు ఉన్నారని తెలిసింది. ఎనిమిది మందిని ఇక్కడ నుండి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారి పరిస్థితి చాలా విషమంగా ఉంది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఐదుగురి మరణాన్ని ధృవీకరించారు. ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. చికిత్స కొనసాగుతోందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

#UPDATE | Chandra Prakash Paryadarshi, City Magistrate Bulandshahr says, ” Total 6 bodies person travel present successful the territory infirmary for post-mortem, 3 antheral bodies and 3 pistillate bodies. These are the victims of the Sikandrabad tragedy. I can’t precisely accidental the full fig of… https://t.co/3IKi4drXve pic.twitter.com/mWzC891fxp

— ANI (@ANI) October 22, 2024

అగ్నిమాపక దళం, పోలీసు విభాగం బృందం, మున్సిపల్ కార్పొరేషన్ బృందం, వైద్య బృందం, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం సంఘటనా స్థలంలో ఉన్నాయని జిల్లా మేజిస్ట్రేట్ చంద్రప్రకాశ్ సింగ్ చెప్పారు. జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు సహాయక చర్యలు చేపట్టామని చెప్పారు. తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని పేలుడుకు గల కారణాలను పరిశీలించాలని సూచించినట్టుగా చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article