ప్రతీ ఇంట్లోనూ వెండి వస్తువులు, వెండి ఆభరణాలు ఉంటాయి. కానీ ఎక్కువ కాలం పాటు ఉపయోగించడం వల్ల వీటి మీద నల్లటి మురికి పేరుకుపోతుంది. ఇది వాటి అందాన్ని తగ్గిస్తుంది. అయితే ఈ సమస్యను ఇంట్లో లభించే సింపుల్ చిట్కాలతో సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఇది మీకు అదనపు ఖర్చు లేకుండా వెండి వస్తువులను కొత్తగా మెరిసేలా మారుస్తుంది. ఈ చిట్కాలను పాటించి మీ వెండి వస్తువులను మళ్లీ కొత్తగా మార్చుకోండి. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయను నేరుగా లేదా మిశ్రమంగా ఉపయోగించడం ద్వారా వెండి వస్తువులను శుభ్రం చేయవచ్చు. ముందుగా ఒక గిన్నెలో బేకింగ్ సోడా తీసుకొని అందులో నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి వెండి వస్తువులకు అప్లై చేయాలి. దానిని కొంత సమయం ఉంచి, సాఫ్ట్ క్లాత్ ని తీసుకొని రుద్దండి. మీ వెండి పాత మురికి పోయి కొత్త మెరుపును పొందుతుంది.
టూత్‌పేస్ట్ కూడా బాగా పనిచేస్తుంది. టూత్‌పేస్ట్‌ను వెండి వస్తువులకు అప్లై చేసి 15-20 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత ఒక టూత్ బ్రష్‌తో రుద్ది మంచి నీటితో శుభ్రం చేయాలి. ఈ పద్ధతిని ఉపయోగిస్తే నల్లటి మురికి తొలగిపోయి వెండి కొత్తగా మెరిసిపోతుంది.
బేకింగ్ సోడా చాలా రకాల లోహాలతో కూడిన వస్తువులను శుభ్రం చేయడానికి వినియోగిస్తారు. అలాగే వెండి వస్తువులను శుభ్రం చేయడానికి కూడా ఇది అద్భుతంగా పని చేస్తుంది. ముందుగా ఒక గిన్నెలో కొంచెం నీటిని పోసి అందులో బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని వెండి వస్తువులకు అప్లై చేసి సాఫ్ట్ క్లాత్ లేదా బ్రష్‌తో రుద్ది 5 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. ఇలా చేస్తే వెండి వస్తువుల మీద ఉన్న మురికి తొలగి అవి మెరుస్తాయి.
వెండి వస్తువులను శుభ్రం చేయడంలో వెనిగర్ కూడా అద్భుతంగా పని చేస్తుంది. నీటిలో కొంత వెనిగర్, బేకింగ్ సోడా కలిపి ఆ మిశ్రమంలో వెండి వస్తువులను నానబెట్టడం ద్వారా అవి మెరిసిపోతాయి.
వెండి వస్తువులను శుభ్రం చేయడంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. కఠినమైన బ్రష్‌లను ఉపయోగించకూడదు. అవి వెండి మీద గీతలు పడేలా చేస్తాయి. వెండిపై ఉన్న డిజైన్లకు హాని కలగకుండా సాఫ్ట్ గా ఉన్న వాటితో క్లీన్ చేయాలి. ఇలా చేస్తే మీ వెండి వస్తువులు బాగుంటాయి. వెండి వస్తువులను శుభ్రం చేసిన తర్వాత సాఫ్ట్ క్లాత్ తో తుడిచి కాసేపు గాలి తగిలేలా పెట్టాలి. ఈ చిట్కాలను ఫాలో అవ్వండి మంచి రిజల్ట్ ఉంటుంది.