ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులకు పెద్దపులి కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. నిన్న నిర్మల్ జిల్లాలో సంచారం ఆ ప్రాంతవాసులను భయాందోళనకు గురిచేస్తే.. ఇవాళ మంచిర్యాల జిల్లాలో మరోసారి కలకలం రేపుతోంది . మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం శంకర్ పల్లి శివారు కేకే-5 గని సమీపంలో పెద్దపులి సంచరించడం కలకలం రేపింది. కేకే-5 గని సమీపంలో పంప్ దగ్గర మహారాష్ట్ర నుంచి పత్తి ఏరడానికి వచ్చిన వలస కూలీలు గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు.
దారి వెంట వెళ్తున్న పెద్దపులిని చూసి వలస కూలీలు ఒక్కసారిగా కేకలు వేశారు. శంకర్ పల్లి నుంచి చతలాపూర్ అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు వారు చెప్తున్నారు. పెద్దపులి సంచారంతో వలస కూలీలు ఆందోళన చెందుతున్నారు. కాగా కేకే-5 గని శివారులో పెద్దపులి సంచారం కనిపించినట్లు ప్రజలు చెబుతున్నారు. శంకర్‌పల్లి దగ్గర కూలీలకు పెద్దపులి కనిపించింది. చతలాపూర్ అటవీ ప్రాంతంలో పులి సంచారం ఉన్నట్లు అధికారులు సైతం గుర్తించారు.
ఇక శుక్రవారం నిర్మల్ జిల్లా పెంబి మండలంలో పులి సంచారం కలకలం రేపింది. పులి సంచారంతో పెంబితండా శివారు ప్రాంతాలు వణికిపోతున్నాయి. పెంబితండా శివారులో అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలు గుర్తించారు. పశువుల మందపై పులి దాడి చేసింది. పెంబితండా శివారు గ్రామాల్లో అటవీశాఖ అధికారులు డప్పు చాటింపు చేయించారు. రెండు రోజులు అడవి, పొలాల్లోకి వెళ్లవద్దని హెచ్చరిక జారీచేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..