Updated on: Feb 07, 2025 | 11:50 AM
మంచిర్యాల జిల్లాలో ఒకేచోట 50 కుక్కల కళేబరాలు కనిపించాయి. ఊళ్లలో పట్టి ఇక్కడకు తెచ్చి చంపేసారంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాండూరు గ్రామ శివారులో పదుల సంఖ్యలో కళేబరాలు.. మత్తుమందు ఇచ్చి పిచ్చికుక్కల్ని పట్టుకున్నామంటున్న పంచాయితీ సిబ్బంది. తెచ్చి అడవిలో వదిలేసాం.. చంపలేదంటున్నారు.
మంచిర్యాల జిల్లాలో ఒకేచోట 50 కుక్కల కళేబరాలు పడి ఉండడం కలకలం రేపింది. చుట్టుపక్కల ఊళ్లలోంచి కుక్కల్ని పట్టి తెచ్చి ఇక్కడ చంపేశారంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాండూరు గ్రామ శివారులో పదుల సంఖ్యలో ఇలా కళేబరాలు కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఐతే.. తాము కుక్కల్ని చంపలేదని, కేవలం మత్తుమందు ఇచ్చి పిచ్చికుక్కల్ని పట్టుకున్నామని పంచాయితీ సిబ్బంది చెప్తున్నారు. తర్వాత వాటిని తెచ్చి అడవిలో వదిలేసామంటున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు పరిసరాల్లో వందలాది కుక్కలు జనాల్ని బయపెడుతున్నాయి. ఇటీవల కూడా పిల్లలు కుక్కకాట్లతో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చేరిన ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమకు ఫిర్యాదులు అందడంతో వీటిని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టేందుకు ఓ బృందాన్ని రప్పించామని MPDO శ్రీనివాస్ చెప్పారు. తాము మత్తుమందు ఇచ్చి వాటిని పట్టుకున్నామని, ఎక్కడా చంపలేదని, చంపాలని చెప్పలేదని కూడా క్లారిటీ ఇస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి
Published on: Feb 07, 2025 11:47 AM