తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. జనవరి 2 నుంచి ప్రారంభమైన పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా 92 కేంద్రాల్లో సోమవారం అంటే జనవరి 20 వరకు దాదాపు పది రోజులపాటు రెండు సెషన్స్ లో జరిగాయి. టెట్ ఎగ్జామ్ కోసం మొత్తం 2,75,753 రమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. మొత్తం 2,05,278 మంది పరీక్షలు రాశారు. తెలంగాణ టెట్ ఎగ్జామ్ లో 74.4% హాజరు నమోదు అయింది. పేపర్ -1 ఎగ్జామ్ కు 94327 మంది అప్లై చేసి 69,476 మంది పరీక్ష రాశారు. పేపర్ -2 మాథ్స్ అండ్ సైన్స్ పరీక్షకు 93,263 మంది అప్లై చేసి 69,390 మంది రాశారు. పేపర్ -2 సోషల్ స్టడీస్ కు 88,163 మంది దరఖాస్తు చేసి 66,412 మంది ఎగ్జామ్ రాశారు.
ఈనెల 24న టెట్ ఎగ్జామ్ ప్రాథమిక కీని విడుదల చేయనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తెలిపారు. ప్రిలిమినరీ కీ పై అభ్యంతరాలు ఉంటే ఈనెల 24 నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు అభ్యర్థులు తెలపాలని విద్యాశాఖ కోరింది. ప్రాథమిక కీని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్లో పొందుపరచినట్లు వెల్లడించారు టెట్ ఎక్సమ్ ఫలితాలను త్వరలోనే విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నామని అధికారులు తెలిపారు. ఏటా రెండుసార్లు టెట్ ఎక్సమ్ నిర్వహిస్తామన్న కాంగ్రెస్ సర్కార్ గత ఏడాది లోనే రెండో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఈ ఏడాది జనవరిలో ఎగ్జామ్స్ ను నిర్వహించింది. పలువురు అభ్యర్థులు తమ టెట్టు స్కోరును పెంచుకునేందుకు మళ్లీ ఎగ్జామ్ రాయగ మరి కొంతమంది అర్హత సాధించేందుకు టెట్ ఎగ్జామ్ను రాశారు ఒకసారి టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే డీఎస్సీ ఎగ్జామ్ రాసేందుకు వారికి అనుమతి ఉంటుంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి