హైదరాబాద్, ఫిబ్రవరి 2: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు జనవరి 30న పర్యావరణ విద్య పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షకు హాజరైన విద్యార్ధుల్లో 128 మంది విద్యార్థులను హాల్‌టికెట్లు లేకుండానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంతో.. వారందరినీ అధికారులు పరీక్షకు అనుమతించారు. జనవరి 29న రాత్రి పరీక్ష ఫీజు చెల్లించినప్పటికీ వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షలకు అనుమతించామని ఇంటర్ బోర్డు పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్టియర్‌లో జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 4,90,987 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.
ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జనవరి 31న, సెకండ్ ఇయర్‌కు ఫిబ్రవరి 1న నిర్వహించారు మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు జూనియర్ కాలేజీల్లో ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 5 నుంచి 15 వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు, ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి.
ఫిబ్రవరి 23న తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష
తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలల్లో 2025 సంవత్సరానికి ఐదు తరగతికి ఇంగ్లిష్ మాధ్యమంలో ప్రవేశానికి ఫిబ్రవరి 1వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. ఫిబ్రవరి 23న గురుకుల పాఠశాలల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని గురుకుల విద్యాలయాల సంస్థ ప్రాంతీయ సమన్వయకర్త డా టి ఆదిత్యవర్మ ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించనున్న ఈ పరీక్షకు ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.