బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రగ్యాజైస్వాల్, శ్రద్దా శ్రీనాద్ హీరోయిన్స్ గా నటించారు. అలాగే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హైలెట్ అనే చెప్పాలి. అలాగే ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం సినిమా విజయంలో కీ రోల్ ప్లే చేసింది. ఈ సినిమా విజయం సాధించడంతో తాజాగా సక్సెస్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో తమన్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
సంగీత దర్శకుడు థమన్ మాట్లాడుతూ, “బాలకృష్ణ గారి సినిమాకి సంగీతం చేయడం అనేది నాకు టెన్త్ ఎగ్జామ్ లా ఉంటుంది. ప్రతి సినిమాకి ఇంకా గొప్ప సంగీతం అందించాలనే కసితో పనిచేస్తున్నాను. బాలకృష్ణ గారిని చూస్తేనే ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ ఉత్సాహంతోనే సంగీతం చేస్తున్నాను. బాలకృష్ణ గారు నాకు తండ్రి లాంటి వారు. నన్నెప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటారు. దర్శకుడు బాబీ గారికి సంగీతం మీద మంచి పట్టు ఉంది. ఆయన విజిల్ చేస్తూ పాటను హమ్ చేశారంటే అది హిట్టే. భైరవద్వీపం మా కుటుంబాన్ని ఆదుకున్న సినిమా అని చెప్పారు తమన్.
డ్రమ్స్ వాయిస్తూ రోజుకి 30 రూపాయలు తీసుకుంటూ బాలకృష్ణ గారి సినిమాతోనే నా సినీ ప్రయాణం మొదలైంది. అలాంటి నేను ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలకు సంగీతం అందించడం అదృష్టంగా భావిస్తున్నాను. దర్శకుడు బాబీ ఎంతో కష్టపడ్డారు. ప్రతి సన్నివేశాన్ని ఇంకా గొప్పగా చేయడానికి ప్రయత్నించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారికి, త్రివిక్రమ్ గారికి, సాయి సౌజన్య గారికి నా స్పెషల్ థాంక్స్. డీఓపీ విజయ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ గా నిలిచారు. డీఓపీ విజయ్, ఎడిటర్లు నిరంజన్, రూబెన్ వల్లే ఇంత మంచి సంగీతం అందించడం సాధ్యమైంది. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు బాబీ గారికి ధన్యవాదాలు.” అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.