Tollywood: 14 ఏళ్లుగా మా కుటుంబం బాధను అనుభవిస్తూనే ఉంది.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

2 hours ago 1

ప్రస్తుతం సినీరంగంలో ప్రేమ, పెళ్లి, విడాకులు కామన్ గా మారిపోయాయి. ఓవైపు హీరోహీరోయిన్స్ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తుండగా.. మరోవైపు కొందరు సంవత్సరాల తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ హీరోయిన్ తనకు విడాకులు లేని పెళ్లి కావాలని.. పెళ్లంటేనే భయమేస్తుందని ఆసక్తిక కామెంట్స్ చేసింది.

 14 ఏళ్లుగా మా కుటుంబం బాధను అనుభవిస్తూనే ఉంది.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

Abhirami Suresh

Rajitha Chanti

|

Updated on: Nov 15, 2024 | 10:39 AM

సినీనటి గాయని అభిరామి సురేష్.. తన సోదరి సింగర్ అమృత సురేష్ జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు విడాకులే లేని పెళ్లి కావాలని.. తన అక్క జీవితం చూసిన తర్వాత పెళ్లంటేనే భయమేస్తుందని అన్నారు. “నేను విడాకులు లేని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది జరుగుతుందో లేదో నాకు తెలియదు. అందుకు కొంత అదృష్టం కూడా ఉండాలి. నేను పెళ్లికి వ్యతిరేకం కాదు.. కానీ మా అక్క జీవితంలో పడ్డ కష్టాలు చూసిన తర్వాత నాకు పెళ్లంటేనే భయంగా ఉంది. ఇప్పటికీ నేను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ భయమే. అది ఏదో ఒకరోజు జరుగుతుందని నేను నమ్ముతున్నాను. మనకు సరైన వ్యక్తిని పెళ్లి చేసుకోని విడిపోతే ఫర్వాలేదు.. కానీ ప్రమాదకరమైన వారితో ప్రేమలో పడిపోతే మరింత భయం” అంటూ చెప్పుకొచ్చింది.

అసలు విషయానికి వస్తే.. నటి, సింగర్ అమృతా సురేష్.. నటుడు బాలాను 2010లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 2012 పాప జన్మించింది. కానీ వీరిద్దరు మనస్పర్థలతో విడిపోయారు. విడాకులు తీసుకున్న తర్వాత నటుడు బాలా తనను, తన కూతురిని వేధిస్తున్నాడని అమృతా పోలీసులను ఆశ్రయించింది. దీంతో బాలాను అరెస్ట్ చేశారు పోలీసులు. తన కూతురిని తన వద్దకు రాకుండా అమృత అడ్డుకుంటుందని బాలా ఆరోపించారు. అయితే అమృత ఓ వీడియో రిలీజ్ చేస్తూ నటుడు బాలా తనతోపాటు తన తల్లితోనూ అసభ్యంగా ప్రవర్తించాడని.. తన వీడియోస్ కారణంగా తమ కుమార్తె మానసికంగా బాధపడుతుందని తెలిపింది. ఈ వివాదం ముగిసిన తర్వాత ఇటీవలే నటుడు బాలా మూడో పెళ్లి చేసుకున్నాడు.

కానీ తన అక్క జీవితం చూసిన తర్వాత తనకు పెళ్లంటేనే భయంగా ఉందంటోంది సింగర్ అభిరామి సురేష్. తన అక్క పెళ్లయినప్పటి నుంచి అంటే దాదాపు 14 ఏళ్లుగా తమ కుటుంబం బాధను అనుభవిస్తూనే ఉందని చెప్పుకొచ్చింది అభిరామి. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article