ఆస్ట్రేలియాకు చెందిన ఆరున్నర అడుగుల ఈ ఫాస్ట్ బౌలర్ ఏకంగా 120 ఏళ్ల రికార్డును చెరిపేశాడు. అతడు మరెవరో కాదు.. ఫాస్ట్ బౌలర్ జాక్సన్ బర్డ్. ఆస్ట్రేలియా దేశవాళీ ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్ షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో న్యూ సౌత్ వేల్స్ తరపున ఆడుతున్న బర్డ్.. 7 వికెట్లు పడగొట్టి కొత్త చరిత్రను తిరగరాశాడు. అడిలైడ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో జాక్సన్ బర్డ్ పదునైన బౌలింగ్ దెబ్బకు సౌత్ ఆస్ట్రేలియా జట్టు కేవలం 110 పరుగులకే ఆలౌటైంది. అతను ఈ మ్యాచ్‌లో మొత్తం 15 ఓవర్లు బౌలింగ్ చేశాడు, అందులో 46 పరుగులిచ్చి ఏడుగురు బ్యాట్స్‌మెన్లను అవుట్ చేశాడు. బర్డ్ 2012లో శ్రీలంకపై అరంగేట్రం చేయగా, ఆస్ట్రేలియా తరఫున చివరి మ్యాచ్ 2017లో ఇంగ్లాండ్‌తో ఆడాడు.
ఇది చదవండి: గోదారి గట్టు సమీపాన మెరుస్తూ కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా.. బాబోయ్
20 ఏళ్ల రికార్డు బద్దలు..
37 ఏళ్ల జాక్సన్ బర్డ్ వచ్చే నెలలో 38 ఏళ్లు పూర్తి చేసుకోనున్నాడు. అతను ప్రస్తుత షెఫీల్డ్ షీల్డ్ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో, బర్డ్ 17.30 సగటుతో, 36.1 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 62 వికెట్లు తీశాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో, అతను ఈ దేశీయ ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్ 120 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. షెఫీల్డ్ షీల్డ్ చరిత్రలో ఏ బౌలర్‌కైనా ఇదే అత్యుత్తమ స్ట్రైక్ రేట్. దక్షిణ ఆస్ట్రేలియా ఓపెనర్ కానర్ మెక్‌నెర్నీతో బర్డ్ ఈ ఫీట్‌ను మొదలుపెట్టాడు. తొలి ఓవర్ మూడో బంతికే కానర్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత వచ్చిన ఇద్దరు బ్యాటర్లను బర్డ్ త్వరతగిన పెవిలియన్ చేర్చాడు. టాప్ ఆర్డర్, ఆ తర్వాత మిడిల్ ఆర్డర్, ఆ నెక్స్ట్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లను సైతం బర్డ్ వదలలేదు. ఈ విధంగా 46 పరుగులకే 7 వికెట్లు తీసి 120 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 18 పరుగులకు 7 వికెట్లు అతని అత్యుత్తమ ప్రదర్శన ఇది.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి: అయ్యబాబోయ్.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదే.. చూస్తే బిత్తరపోతారు
బర్డ్ టెస్ట్ కెరీర్ ఇలా..
జాక్సన్ బర్డ్ ఆస్ట్రేలియా తరపున 9 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 17 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 34 వికెట్లు తీశాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడంలో జాక్సన్ బర్డ్ దిట్ట. అతనికి వన్డే లేదా టీ20ల్లో అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. ఇంటర్నేషనల్ టెస్టు మ్యాచ్ ఆడి బర్డ్‌కి నేటికి 7 ఏళ్లు పూర్తయింది. బర్డ్ తన షెఫీల్డ్ షీల్డ్‌లో 2011–12లో అరంగేట్రం చేశాడు. మొదటి సీజన్‌లోనే 53 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు, దానితో అతడు టోర్నమెంట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా ఎంపికయ్యాడు.
ఇది చదవండి: విద్యార్ధులకు గుడ్‌న్యూస్ అంటే ఇది కదా.. ఒక్కొక్కరికి రూ. 6 వేలు
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..