సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు కేపీ చౌదరి. ఇక ఇప్పుడు గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికే చాలా సందర్భాల్లో డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. అంతే కాదు పలువురు సినీ ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇక గతంలో ప్రొడ్యూసర్ కేపీ చౌదరి అరెస్ట్ అవ్వడం ఇండస్ట్రీని షేక్ చేసింది.
గత ఏడాది జూన్ లో కబాలి మూవీ ప్రొడ్యూసర్ కేపీ చౌదరి అరెస్ట్ కావడంతో.. సినీ సెలబ్రిటీల గుండెల్లో గుబులు మొదలైంది. చౌదరి నుంచి 4మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాల్‌డేటా, వాట్సప్ చాట్‌లను విశ్లేషించారు. చౌదరికి సంబంధించిన సెల్‌ఫోన్ డేటాతో పాటు గతంలో అరెస్ట్ వారి డేటాను వెరిఫై చేశారు.
కాల్ డేటా, వాట్సప్ చాట్‌లో ఇండస్ట్రీకి సంబంధించిన వారి పేర్లతో ఓ లిస్ట్‌ను తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎవరి పేర్లు తెరపైకి వస్తాయన్నది అప్పుడు ఉత్కంఠగా మారింది.. 2023 జూన్ 14న డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కింగ్ పిన్, నైజీరియాకు చెందిన డ్రగ్స్ పెడ్లర్ రాకేష్ రోషన్‌తో కేపీ చౌదరికి ఉన్న సంబంధాలపై పోలీసులు అప్పట్లో ఆరాతీశారు. ఇక ఇప్పుడు ఆయన గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి