తెలుగులో ఒకే ఒక్క సినిమాలో నటించింది.. కానీ పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ స్టార్ హీరో సరసన మాస్ యాక్షన్ డ్రామాలో నటించి భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడిప్పుడే తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటుంది. మరోవైపు చేతినిండా సినిమాలతో క్షణం తీరికలేకుండా గడిపేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? బాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత రెగ్యులర్ స్టోరీస్ కాకుండా విభిన్న కంటెంట్.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే ఈ అమ్మడు నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన అందుకున్నాయి. అదే సమయంలో ఒక్క తెలుగు సినిమాతో సెన్సేషన్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరంటే.. తనే హీరోయిన్ జాన్వీ కపూర్.
దివంగత హీరోయిన్ శ్రీదేవి కూతురిగా సినీరంగంలోకి దఢక్ సినిమాతో అడుగుపెట్టింది. మరాఠీలో సెన్సేషన్ అయిన సైరత్ సినిమాకు హిందీ రీమేక్ ఇది. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుని నటిగా ప్రశంసలు సైతం గెలుచుకుంది. ఇక ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. కానీ ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకున్నాయి. రెగ్యులర్ హీరోయిజం సినిమాలు కాకుండా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, ఛాలెంజింగ్ రోల్స్ తీసుకుంటూ ప్రేక్షకులను మెప్పించింది. ఇక గతేడాది జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
ఇవి కూడా చదవండి
దేవర సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. అచ్చమైన పల్లెటూరి అమ్మాయిల.. అద్భుతమైన నటనతో అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత తెలుగులో జాన్వీకి వరుస ఆఫర్స్ వచ్చాయి. ప్రస్తుతం ఆమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటిస్తుంది. డైరెక్టర్ బుచ్చిబాబు సన, చరణ్ కాంబోలో రాబోయే ప్రాజెక్టులో కథానాయికగా కనిపించనుంది. ప్రస్తుతం ఆమె పరం సుందరి మూవీ చిత్రీకరణలో బిజీగా ఉంది. ఇందులో సిద్ధార్త్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ కేరళలో జరుగుతుంది.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన