Tollywood: ముగ్గురితో ప్రేమ, బ్రేకప్.. 49 ఏళ్ల వయసులోనూ ఆ నటుడితో డేటింగ్.. ఈ తెలుగు హీరోయిన్ ఎవరంటే..

1 hour ago 1

సినీరంగుల ప్రపంచంలో ప్రేమ, డేటింగ్, బ్రేకప్ అనేది సర్వసాధారణం. సినిమాల్లో నటీనటులుగా అలరించి విమర్శకుల ప్రశంసలు అందుకుని స్టార్ డమ్ సొంతం చేసుకుంటారు. కానీ నిజజీవితంలో మాత్రం ప్రేమ, పెళ్లి విషయాల్లో ఓడిపోతారు. అలాంటి హీరోయిన్స్ ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నారు. పెళ్లైన నటులతో ప్రేమాయణం.. లేదంటే పెళ్లి వరకు చేరాల్సిన ప్రేమకథలు మధ్యలోనే ముగిసిపోతుంటారు. కానీ అలనాటి హీరోయిన్ ముగ్గురు పెళ్లైన నటులను ప్రేమించింది. కానీ ఆమె ప్రేమ పెళ్లిపీటలెక్కలేదు. ప్రస్తుతం ఆమె వయసు 49 ఏళ్లు. ఇప్పటికీ ఒంటరిగానే ఉంటుంది. తనే హీరోయిన్ నగ్మా. 1990లో అగ్రనటి.

నగ్మా 90వ దశకంలో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్, షారుఖ్, సంజయ్ దత్ వంటి స్టార్ హీరోలతో అనేక చిత్రాల్లో నటించింది. అప్పట్లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది. దక్షిణాదిలో హాట్ బ్యూటీగా చాలా ఫేమస్ అయ్యింది. నగ్మా అసలు పేరు నందితా అరవింద్ మొరార్జీ. ఆమె తల్లి సీమ తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి నిర్మాత చందర్ సాధన్ ను పెళ్లి చేసుకుంది. వీరికి జ్యోతిక, రోహిణి జన్మించారు. నగ్మాతోపాటు ఆమె చెల్లెల్లు జ్యోతిక, రోహిణి సైతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్. నగ్మా తన తండ్రి ప్రోత్సాహంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. సల్మాన్ ఖాన్‌తో ‘బాఘీ’ చిత్రంతో తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత తెలుగులో సుమన్‌తో కలిసి ‘పెద్దింటి అల్లుడు’ సినిమా చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత నాగార్జునతో ‘కిల్లర్‌’లో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఘరానా మొగుడు చిత్రంలో నటించింది. ఈ సినిమా తర్వాత ఎన్నో ఆఫర్స్ అందుకుంది. అయితే వ్యక్తిగత విషయాలతో అప్పట్లో తెగ వార్తలలో నిలిచింది. అలాగే క్రికెటర్ సౌరవ్ గంగూలీతో ప్రేమలో పడింది. కొంత కాలంగా వీరిద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారని పుకార్లు కూడా వచ్చాయి. ఆ తర్వాత గంగూలీ భార్యకు ఈ విషయం తెలియడంతో వారి బంధం తెగిపోయింది. ఆ తర్వాత కోలీవుడ్ హీరో శరత్ కుమార్, మరో హీరోతో నగ్మా పేరు ముడిపడి ఉంది. కానీ ఏ ప్రేమలు పెళ్లి వరకు చేరలేదు. ఇప్పుడు ఆమె వయసు 49 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటుంది. ప్రసతుతం రాజకీయాల్లో చురుకుగా ఉన్న నగ్మా.. సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు నగ్మా బాలీవుడ్ నటుడితో డేటింగ్ చేస్తుందని.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ నడుస్తోంది.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article