సాధారణంగా చాలా మంది తారలు సినీరంగంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అనేక కష్టాలను, సవాళ్లను ఎదుర్కొని నటిగా ఫేమస్ అవుతారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్వయంకృషితో ఎదిగిన తారలు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో అవమానాలు, సవాళ్లను భరించి స్టార్ స్టేటస్ అందుకుంటారు. అలాంటివారిలో ఈ హీరోయిన్ కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇవ్వకముందే ఎన్నో కష్టాలను చూసింది. 18 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. 20 ఏళ్లకే తల్లైంది. కానీ ఆ తర్వాత ప్రేమ, పెళ్లి బంధాలు ఆమె జీవితంలో కలిసిరాలేదు. రెండుసార్లు పెళ్లి, రెండుసార్లు విడాకులు. ఆమె మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?
ఆమె మరెవరో కాదండి.. బుల్లితెర బ్యూటీ శ్వేతా తీవారి. హిందీలో ఈ అమ్మడు చాలా ఫేమస్. 2000లో ఆనే వాలా పల్ సీరియల్ ద్వారా నటిగా సినీరంగానికి పరిచయమైంది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు, సీరియల్స్ చేసి మరింత పాపులర్ అయ్యింది. 18 ఏళ్లకే నటుడు రాజా చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 20 ఏళ్లకే వీరికి ఓ పాప జన్మించింది. అయితే కొన్నాళ్లు బాగానే ఉన్న వీరిద్దరి మనస్పర్థలతో విడిపోయారు. ఆ తర్వాత మరో నటుడు అభినవ్ కోహ్లీతో ప్రేమలో పడింది. అతడితో మూడేళ్లు డేటింగ్ చేసిన తర్వాత 2013 జూలై 13న వీరిద్దరి పెళ్లి చేసుకున్నారు. వీరికి 2016 నవంబర్ 27 బాబు జన్మించాడు. కానీ ఈ బంధం కూడా ఎక్కు రోజులు సాగలేదు. 2019లో వీరిద్దరు డివోర్స్ తీసుకున్నారు.
రెండుసార్లు డివోర్స్ తీసుకున్న తర్వాత శ్వేతా తివారీ ప్రస్తుతం ఒంటరిగా తన పిల్లలతో కలిసి ఉంటుంది. జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొన్న తర్వాత సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండిపోయింది. ప్రస్తుతం హిందీ బుల్లితెరపై డిమాండ్ ఉన్న తారలలో శ్వేతా తివారీ ఒకరు. ఈ బ్యూటీ ఆస్తి దాదాపు 80 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. అలాగే ఒక్క ఎపిసోడ్ కోసం లక్షల్లో పారితోషికం తీసుకుంటుందట.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..