TOP 9 ET News: రామ్ చరణ్‌ పాటకు కొరియన్ స్టార్ట్స్ క్రేజీ డ్యాన్స్

2 hours ago 1

 రామ్ చరణ్‌ పాటకు కొరియన్ స్టార్ట్స్ క్రేజీ డ్యాన్స్

|

Updated on: Oct 22, 2024 | 11:52 AM

గేమ్‌చేంజర్‌ గోస్‌ గ్లోబల్‌ అంటున్నారు రామ్‌చరణ్‌ అభిమానులు. సౌత్‌ కొరియన్‌ సింగర్‌, కంపోజర్‌ పార్క్ మిన్‌ జున్‌.. రా మచ్చా మచ్చా పాటను షేర్‌ చేసిన వీడియో క్లిప్‌ను సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు. అలా చేస్తూనే ఖుషీ అవుతున్నారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది గేమ్‌ చేంజర్‌ మూవీ. బాహుబలితో.. జపాన్‌ బాక్సాఫీస్‌ దగ్గర పాగా వేసిన మన ప్రభాస్‌ డార్లింగ్.. అక్కడ ఎక్కడలేని ఫ్యాన్ బేస్‌ సంపాదించుకున్నాడు.

అప్పటి నుంచి జపనీయులు ఆదరాభిమానాలను అందుకుంటున్నాడు. ఇక ఈ క్రమంలోనే కాస్త ముందుగానే.. జపాన్‌లో ప్రభాస్‌ బర్త్‌ డే వేడుక షురూ అయింది. అక్టోబర్ 23 ప్రభాస్‌ బర్త్‌ డే కానుకగా.. అక్కడ రాధేశ్యామ్ సినిమాను రీ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో అక్కడ.. ఇప్పుడు ప్రభాస్‌ మేనియా షురూ అయిపోయింది. హ్యాపీ బర్త్‌ డే టూ ప్రభాస్‌ అంటూ.. థియేటర్లో జపనీయులు కటౌట్స్‌ ఎగరవేయడం ఇప్పుడు త్రూ అవుట్ వరల్డ్ హాట్ టాపిక్ అవుతోంది. అక్కినేని ఇంటికి కోడలు కాబోతున్న శోభిత ధూళిపాళ కుటుంబం పెళ్లి పనులు మొదలుపెట్టింది. తాజాగా శోభిత పెళ్లికి సంబంధించి.. గోధుమరాయి, పసుపు దంచే ఫంక్షన్‌.. వైజాగ్‌లోని తన ఇంట్లో గ్రాండ్‌గా జరిగింది. పసుపు కొట్టే కార్యక్రమంలో ట్రెడిషనల్ లుక్​తో ఆరెంజ్, గ్రీన్ అంచు శారీలో పసుపు దంచుతూ.. శోభితా కనిపించింది. శోభిత మాత్రమే కాదు.. శోభిత ఫ్యామిలీ, బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలను శోభిత తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. గోధుమరాయి, పసుపు దంచడం.. పనులు మొదలయ్యాయి అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు కూడా..

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పశువుల పాకలోకి వెళ్లిన యజమాని.. అక్కడ సీన్‌ చూసి షాక్‌

మీకు ఓటేశాను.. నాకు పెళ్లి చేయండి.. ఓటరు చేతిలో ఎమ్మెల్యేకు ఊహించని అనుభవం

ఇంత చిన్న వాషింగ్ మెషీన్ మీరెప్పుడూ చూసి ఉండరు

యూట్యూబ్‌లో స్లీప్‌ టైమర్‌ ఆప్షన్‌.. ఎలా పనిచేస్తుందంటే ??

Blinkit: బ్లింక్ ఇట్ ఐడియా అదిరిపోయిందిగా !!

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article