విక్టరీ వెంకటేష్ తోటి హీరోల్లో కొంత మంది.. జూనియర్ హీరోల్లో మరి కొంత మంది అవలీలగా.. తమ సినిమాలతో 50 కోట్లకు మించి కలెక్షన్స్‌ను రాబడుతున్నారు. రికార్డ్ హిట్లు కొడుతున్నారు. కానీ వెంకీ సోలోగా యాక్ట్ చేసిన ఏ సినిమా 50 కోట్లకు మించి, ఇప్పటి వరకు వసూలు చేయలేదు. దీంతో డిస్సపాయింట్‌లో ఉన్న తన ఫ్యాన్స్‌కి దిమ్మతిరిగేంత ఖుషీనిచ్చాడు విక్టరీ వెంకటేష్.
ఏకంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో.. తన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్‌తో.. అందర్నీ ఆకట్టుకున్న ఈ స్టార్.. ఆల్ టైం రికార్డ్‌ను సెట్ చేశాడు. జస్ట్ 6 రోజుల్లో రూ.100 కోట్లను వసూలు చేశాడు. కాలర్ ఎగరేసే విక్టరీని తన ఫ్యాన్స్‌కు ఇచ్చాడు. బుల్లి రాజు అలియాస్ రేవంత్! భీమవరంలో పుట్టిన ఈ బుడ్డోడు.. ఇప్పుడు త్రూ అవుట్ వరల్డ్ పాపులర్ అయిపోయాడు. అందులోనూ తెలుగు టూ స్టేట్స్‌లో అయితే స్టార్ అయిపోయాడు. సంక్రాంతి వస్తున్నాం సినిమాలో తను చేసిన పెర్ఫార్మెన్స్‌తో.. సినిమాకే హైలెట్ అయిపోయాడు. దీంతో ఈ చిన్నోడికి ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఆఫ్టర్ సంక్రాంతి రిలీజ్.. ఈ చిన్నోడిని చూసేందుకు ఫోటోలు దిగేందుకు.. అందరూ పోటీ పడుతున్నారు. బుల్లి రాజు కనిపిస్తే చాలు.. గట్టిగా పట్టుకుని ఫోటోలు దిగుతూ విసిగిస్తున్నారు. ఆ చిన్నోడిని ఇబ్బంది పెడుతున్నారు. అలా ఫోటోల కోసం ఈ చిన్నోడిని కొందరు నలిపేస్తున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. అది కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోగం కాదు.. ఓవర్ యాక్షన్.. పబ్లిసిటీ కోసమే కదా.. ఈ కథలు!
Akhil Akkineni: అయ్యవారి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ ?
షూటింగ్ పేరుతో అడవిలో మంటలు.. హీరోకు వార్నింగ్ ఇచ్చిన గ్రామస్థులు
ఈ ఆకులను చీప్‌గా చూడకండి.. నాలుగు ఆకులు తిన్నారంటే రోగాలన్నీ పరార్