అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్ ఒక్కసారిగా అలజడి పెంచింది. అనుకున్నది అనుకున్నట్టుగా చేసి తీరడంలో ట్రంప్ చాలా పట్టుదలతో ఉంటారు. టారిఫ్ వార్ తప్పదు అని ప్రమాణ స్వీకారం రోజునే చెప్పారు. అన్నట్టుగానే..అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆ పని మొదలు పెట్టారు.
Donald Trump
చైనా, మెక్సికో, కెనడాపై టారిఫ్‌లు భారీగా పెంచారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇప్పుడు చైనాకి మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. పనామా కెనాల్ అంశాన్ని ప్రస్తావిస్తూ…”చూస్తూ ఉండండి. ఎవరూ ఊహించనిదేదో త్వరలోనే జరుగుతుంది” అని స్టేట్‌మెంట్ ఇచ్చారు ట్రంప్. మామూలుగానే షాక్‌లు ఇచ్చే ట్రంప్..ఈ సారి వార్నింగ్ ఇచ్చి మరీ చైనాని గట్టిదెబ్బ కొట్టేలా ఉన్నారు. అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలను కలిపే అత్యంత కీలకమైన పనామా కెనాల్‌పై చైనా ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇది అమెరికాకు అసలు నచ్చడం లేదు. ఆ కెనాల్‌పై చైనా డామినేషన్ ఏంటని ప్రశ్నిస్తున్నారు ట్రంప్. ఒప్పందాలను ఉల్లంఘించి మరీ చైనా ఆధిపత్యం చెలాయిస్తోందని మండి పడుతున్నారు. అంతే కాదు. అసలు ఈ పనామా కెనాల్‌ని నిర్మించిందే అమెరికా అని తేల్చి చెప్పారు.
ఈ పనామా కెనాల్‌ని వండర్ ఆఫ్ ది వరల్డ్‌గా అభివర్ణిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. 1914లో అమెరికా ఈ కెనాల్‌ని నిర్మించిందని స్పష్టం చేశారు. నిజానికి ఈ కెనాల్‌పై అమెరికాదే పైచేయి అని అంటున్నారు ట్రంప్. 1999లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్.. ఈ కెనాల్‌ని పనామాకి అప్పగించారని, కానీ…దీన్ని ప్రస్తుతం చైనా ఆపరేట్ చేస్తోందని వాదిస్తున్నారు. ఈ విషయంలో యుద్ధం అక్కర్లేకున్నా…గట్టిగానే పోరాటం చేస్తామని అంటున్నారు. అంతే కాదు. ఈ కెనాల్ విషయంలో ఒప్పందాలను పనామా ఉల్లంఘించిందని ఆరోపిస్తున్నారు. “ఇప్పుడు పనామా కెనాల్‌పై పరోక్షంగా చైనాయే ఆధిపత్యం చెలాయిస్తోంది. అసలు ఈ కాలువను చైనాకి ఎవరూ ఇవ్వలేదు. కానీ నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. కచ్చితంగా మీరెవరూ ఊహించనిదేదో త్వరలోనే జరగబోతుంది. ఆ కెనాల్‌ని పూర్తిగా మేమే స్వాధీనం చేసుకుంటాం” అని వెల్లడించారు ట్రంప్. గతంలోనూ పనామా కెనాల్ గురించి చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఇది అమెరికాకి విలువైన సంపద అని, దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. అమెరికా పరంగా చూస్తే దాదాపు 40% మేర కంటెయినర్‌లు ఈ కెనాల్ నుంచే వెళ్తాయి. భారీ ఎత్తున సరుకులను బట్వాడా చేస్తాయి. కేవలం ఆర్థిక పరంగానే కాదు. చైనా ఆధిపత్య ధోరణిని అడ్డుకునేందుకు కూడా అమెరికా ఇలా పనామా కెనాల్‌పై పట్టుదలగా ఉంది.
మరిన్ని ప్రపంచ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..