Unstoppable With NBK 4: సూపర్ హీరోగా బాలయ్య.. అన్‌స్టాపబుల్ సీజన్ 4 ట్రైలర్ చూశారా? స్ట్రీమింగ్ డేట్ ఇదే

2 hours ago 2

తెలుగు ఓటీటీ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్న టాక్ షోస్‌ లో ఆహా ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ ఒకట. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఈ సెలబ్రిటీ టాక్‌ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్ కు కూడా ముస్తాబవుతోంది. తాజాగా దసరా పండగను పురస్కరించుకుని కొత్త సీజన్ ఫస్ట్ లుక్, ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో బాలయ్య.. సూపర్ హీరోగా కనిపించాడు. సుమారు నాలుగున్నర నిమిషాల పాటు ఉన్న ఈ వీడియో అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక అక్టోబరు 24వ నుంచి అన్ స్టాపబుల్ నాలుగో సీజన్ స్ట్రీమింగ్‌ కానుంది. కాగా ఈ కొత్త సీజన్ లో ఎన్ని ఎపిసోడ్‌లు ఉంటాయి? అతిథులుగా ఎందరు కనిపిస్తారు? అన్నిటిన్నా మించి సీజన్‌4 ఫస్ట్ ఎపిసోడ్‌ గెస్ట్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. కాగా అన్ స్టాపబుల్ సీజన్ 4 కు సంబంధించి తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. బాలకృష్ణ, అల్లు అరవింద్‌, అనిల్‌ రావిపూడి, తేజస్విని నందమూరిమ, రాజీవ్‌ చిలక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య ఈ టాక్ షో గురిచి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే సినిమాల్లో తన 50 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా తాజాగా విడుదలైన అన్ స్టాపబుల్ సీజన్ 4 ట్రైలర్ కు సరిపోదా శనివారం ఫేమ్ జేక్స్ బెజోయ్‌ సంగీతం అందించడం విశేషం. ఇదిలా ఉంటే ఈ దసరాకి NBK-109 రిలీజ్‌ కావాలి. ఐతే.. ఎలక్షన్ల కారణంగా NBK-109 షూటింగ్‌ ఆలస్యం అయ్యింది. దసరాకి రిలీజ్ కుదరలేదు. ఈ నేపథ్యంలోనే సినిమా వాయిదాపడినా అన్‌స్టాపబుల్‌ షోతో ముందుకు వస్తున్నారు బాలకృష్ణ

పండుగ సమయం వచ్చేసింది..  అక్టోబర్ 24 నుంచి కొత్త సీజన్ స్ట్రీమింగ్..

పండుగ సమయం వచ్చేసింది!🥳 The Massiest superhero is here.. 💥⚡ Jai Balayya.. 🙋🏻‍♀️🙋🏻‍♂️

Watch #UnstoppableS4 trailer▶️https://t.co/14OCztzA78#UnstoppableWithNBK #UnstoppableS4 #AhaOriginalSeries #NandamuriBalakrishna #JaiBalayya #NBK pic.twitter.com/STGikLw2I3

— ahavideoin (@ahavideoIN) October 12, 2024

అన్‌స్టాపబుల్ సీజన్ 4 ట్రైలర్  ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article