Upasana: తాత పుట్టిన రోజున మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మెగా కోడలు.. పిఠాపురం నుంచే ప్రారంభం

2 hours ago 2

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన చేపడుతోన్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అపోలో ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలు చూసుకుంటోన్న ఆమె మహిళలు, పేదల కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే మూగ జీవాల సంరక్షణ కోసం తోడ్పడుతోంది. తాజాగా ఉపాసన మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది. అపోలో ఆస్పత్రుల అధినేత, తన తాత ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆమె ఓ మంచి పనికి శ్రీకారం చుట్టింది. మహిళా శిశు సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ఆమె వెల్లడించింది. తన మామ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది ఉపాసన. ‘ప్రసూతి, శిశు మరణాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అనంతరం మహిళలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, మహిళా సాధికారతలో భాగంగా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు నైపుణ్యాల పెంపుదలపై అవగాహన కల్పిస్తాం’ అని ఉపాసన పేర్కొంది.

‘మీ అందరి ఆశీర్వాదంతో ఆరోగ్య, సాధికారత తల్లులు, చిన్నారులను తయారు చేస్తాం. సుమారు వెయ్యి రోజుల పాటు ఈ కార్యక్రమం చేపట్టనున్నాం. సమాజానికి తిరిగి ఇచ్చే అవకాశం రావడం నా బాధ్యతగా భావిస్తున్నాను. మహిళలు ఆరోగ్యంగా ఉండాలి. వారి పిల్లలు సంపూర్ణ పోషణ అంది పుచ్చుకోవాలి. ఈ లక్ష్యంతోనే మా ప్రయాణం మొదలైంది. తొలుత పిఠాపురంలో ప్రారంభం కానున్న ప్రాజెక్ట్ తర్వాత మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాం’ అని ఉపాసన తెలిపింది.

ఇవి కూడా చదవండి

తాత అపోలో ప్రతాప్ రెడ్డితో కొణిదెల ఉపాసన..

Thatha, each day of yours is special, but connected this 93rd birthday, we are honored to observe by driving meaningful alteration to mothers —starting successful Pitapuram.

Our Commitment to Transform Motherhood: ✅ Zero Maternal & Infant Mortality ✅ 1,000-Day Program – Prioritizing… pic.twitter.com/yQC7XwmTox

— Upasana Konidela (@upasanakonidela) February 5, 2025

ఉపాసన షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెను అభినందిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

Happy Birthday to the astir caring & disciplined Nainama Love surviving with you. Check retired our station Yoga glow 🧘‍♀️🥰 Btw she ne'er misses a class Truly inspiring 🙌 pic.twitter.com/L7vqtv2fF3

— Upasana Konidela (@upasanakonidela) January 29, 2025

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article