దేశంలో డిజిటల్ చెల్లింపులు క్రమంగా పెరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత ఈ లావాదేవీలు ఉపందుకున్నాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ ప్రతి ఒక్కరూ డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. రోడ్డు పక్కనే నిర్వహించే బజ్జీల బండి నుంచి ఫైవ్ స్టార్ హోటళ్ల వరకూ ఈ చెల్లింపులు జరిపే అవకాశం ఉంది. ఫోన్ లోని పేమెంట్ యాప్ లను ఉపయోగించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ద్వారా ఈ లావాదేవీలను చాలా సులభంగా చేసుకోవచ్చు.
సామాన్యులు కూడా మరింత సులువుగా లావాదేవీలు జరిపేందుకు యూపీఐ లైట్ అనే వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. చిన్న మొత్తాల చెల్లింపుల కోసం ఆన్ డివైస్ వాలెట్ గా ఇది పనిచేస్తుంది. లింక్ చేసిన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులను యూపీఐ లైట్ కు పంపించుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా యూపీఐ లైట్ లోకి డబ్బు ఆటోమెటిక్ గా ట్రాన్స్ ఫర్ అవుతుంది. నవంబర్ ఒకటి నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. యూపీఐ లైట్ లో సొమ్ము నిర్ణీత పరిమితి కన్నా తక్కువగా ఉంటే గతంలో మాన్యువల్ గా టాప్ అప్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ నవంబర్ ఒకటి నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది.
వాలెట్ లో బ్యాలెన్స్ తక్కువగా ఉంటే కొత్త ఫీచర్ సాయంతో ఆటోమేటిక్ గా టాప్ అప్ అవుతుంది. దీంతో మీ డిజిటల్ చెల్లింపులకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (యూపీసీఐ) కొత్త ఆటో టాప్ ఫీచర్ తీసుకువచ్చింది. ఉదాహరణకు మీ యూపీఐ లైట్ వాలెట్ లో రూ.100 సెట్ చేసుకున్నారు. అంటే మీ ఖాతాలో రూ.వంద కంటే తక్కువ మొత్తం ఉంటే లింక్ చేసిన బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్ గా డబ్బులు యాడ్ అవుతుంది. గతంలో అయితే పరిమితి కన్నా తక్కువ డబ్బులు ఉంటే మీరు మాన్యువల్ గా ట్రాన్స్ ఫర్ చేసుకోవాల్సి వచ్చేది. యూపీఐ లైట్ ద్వారా డబ్బును మాత్రమే పంపే వీలుంటుంది. ఈ ఖాతాలోకి నేరుగా వేరొకరు డబ్బులు పంపడానికి వీలుండదు. లింక్ చేసిన బ్యాంకు ఖాతా నుంచి మాత్రమే డబ్బులు జమ చేసుకునే అవకాశం ఉంది.
యూపీఐ లైట్ ను చాలా సులభంగా వినియోగించుకోవచ్చు. చిన్న మొత్తాల లావాదేవీలు నిర్వహించడానికి బాగా ఉపయోపడుతుంది. పిన్ లేకుండా చెల్లింపులు జరపవచ్చు. నెట్ వర్క్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా సురక్షితంగా పనిచేస్తుంది. ఇది ఒక ఆన్ డివైస్ వాలెట్ లాంటింది. గతంలో యూపీఐ లైట్ ద్వారా గరిష్టంగా రూ.500 విలువైన లావాదేవీలు నిర్వహించే వీలుండేది. వాలెట్ లో గరిష్టంగా రూ.2 వేలు ఉంచుకోవాలి. కొత్తగా వచ్చిన ఆటో టాప్ నేపథ్యంలో వాటిని సవరించారు. ఇప్పుడు గరిష్టంగా రూ.4 వేలు ఉంచుకునే అవకాశం లభించింది. లావాదేవీ గరిష్ట పరిమితిని రూ.500 నుంచి రూ.1000కి పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. అలాగే వాలెట్ పరిమితిని రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి