కలబంద మొక్కను ఇంట్లో పెంచడం వల్ల శుభం కలుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇది ప్రతికూల శక్తులను దూరంగా ఉంచి, సానుకూల శక్తిని పెంచుతుందట. చాలామంది కలబందను అదృష్టంగా భావిస్తారు. అయితే దీనిని నాటేటప్పుడు కొన్ని వాస్తు నియమాలు పాటించాలి.
సరైన దిశ ఎటు..?
కలబందను ఏ దిశలో పెట్టాలి..? ఏ దిశలో పెట్టకూడదు..? అనే విషయాలు తెలుసుకోవాలి. వాస్తు ప్రకారం కలబంద మొక్కను ఇంట్లో నాటడం చాలా మంచిది. ఇది కష్టతరమైన జీవితాన్ని మెరుగుపరచడంతో పాటు, విజయానికి తోడ్పడుతుంది. కలబంద నాటిన చోట ప్రేమ, శ్రేయస్సు, సంపద, ప్రతిష్ట పెరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
ఈ మొక్కను నాటడానికి సరైన దిశను ఎంచుకోవడం ముఖ్యం. కలబందను ఇంటికి తూర్పు వైపున నాటడం ఉత్తమం. దీనిని ఆగ్నేయ దిశలో కూడా నాటవచ్చు. ఉద్యోగంలో పురోగతి కావాలంటే కలబందను ఇంటికి పడమర దిశలో నాటాలి. కలబందను పొరపాటున కూడా వాయవ్య దిశలో నాటకూడదు.
వాయువ్య దిశలో ఎందుకు నాటకూడదు..?
వాస్తు ప్రకారం ఈ మొక్కను వాయవ్య దిశలో నాటితే అనేక ఇబ్బందులు వస్తాయి. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కలబంద మొక్క అనేక సమస్యలను తొలగిస్తుంది. దీనిని ఇంట్లో నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరిగి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అదేవిధంగా కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.
ఇంటికి ఆగ్నేయ దిశలో కలబందను పెంచడం వల్ల ఇంట్లో ధనం పెరుగుతుంది. అంతే కాకుండా ఉద్యోగాలలో ప్రమోషన్ లభిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంటి బాల్కనీలో లేదా తోటలో కలబందను పెట్టుకుంటే ప్రతికూల శక్తులు లోపలికి రాకుండా ఉంటాయి. కాబట్టి, కలబందను నాటేటప్పుడు వాస్తు నియమాలను, సరైన దిశను గుర్తుంచుకోవాలి.