మనం డబ్బును ఎక్కడ, ఎలాంటి వస్తువులతో ఉంచుతున్నామనేది అదృష్టాన్ని ప్రభావితం చేస్తుందట. కొన్ని నిర్దిష్టమైన వస్తువులు డబ్బుతో కలిపి ఉంచడం వల్ల లక్ష్మీ కటాక్షం తగ్గుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
డబ్బుతో కలిపి ఇవి ఉంచకూడదు
ఇంట్లో ధాన్యం నిల్వ ఎక్కువగా ఉండటం శుభప్రదమే అయినా.. వాటిని డబ్బుతో కలిపి ఉంచడం మంచిది కాదు. వాస్తు ప్రకారం ఈ వస్తువులు ఆర్థిక స్థిరతను దెబ్బతీసి అనుకోని ఖర్చులను పెంచుతాయి. ధనం నిలువకుండా నిరంతరం ఖర్చవుతూ ఉంటుంది.
బిల్లులు, అప్పు రసీదులు
బిల్లులు, అప్పు రసీదులు, వాడిన పుస్తకాలను డబ్బుతో కలిపి ఉంచడం కూడా మంచిది కాదట. ఈ వస్తువులు ఆర్థిక సమస్యలను పెంచే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ వస్తువులను ప్రత్యేకంగా ఉంచడం శ్రేయస్కరం. ఇలా వాస్తు నియమాలను పాటిస్తూ డబ్బును శుభప్రదమైన ప్రదేశంలో ఉంచితే అదృష్టం మెరుగవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
పాత నోట్లు, నాణేలు
అసలే డబ్బు నిలవదు అనుకుంటుంటే మీరు పాత, చిరిగిపోయిన నోట్లు, ఉపయోగం లేని నాణేలను పర్సులో లేదా బీరువాలో ఉంచి ఉండవచ్చు. వాస్తు ప్రకారం ఇవి ఆర్థిక ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. నిధుల నిల్వ తక్కువ అవుతుందని నమ్మకం. కాబట్టి అవసరం లేని నాణేలు, పాడైన నోట్లు వెంటనే తొలగించేయాలి.
పగిలిన గాజు, విరిగిన ఆభరణాలు
పగిలిన గాజు వస్తువులు, విరిగిన ఆభరణాలు, ఇతర ఉపయోగం లేని వస్తువులను డబ్బుతో పాటు ఉంచడం పెద్ద దోషంగా భావిస్తారు. ఇవి ఆర్థిక నష్టానికి సంకేతంగా ఉంటాయని చెబుతారు. కాబట్టి ఇలాంటి వాటిని ఇంట్లో ఉంచకుండా వెంటనే తీసివేయడం ఉత్తమం.
పదునైన వస్తువులు ఉంచకూడదు
కత్తులు, కటారీలు, పెన్నులు, బ్లేడ్‌లు వంటి పదునైన వస్తువులను డబ్బుతో కలిపి ఉంచడం మంచిది కాదు. ఇవి ఆర్థిక ఒడిదుడుకులకు, అకాల ఖర్చులకు దారి తీస్తాయి. వాస్తు ప్రకారం ఇవి అదృష్టాన్ని దూరం చేసే శక్తిని కలిగి ఉంటాయి.