భారతదేశంలోని ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంది. పీఎఫ్ ద్వారా ఉద్యోగి ప్రాథమిక జీతంలో 12 శాతం, అలాగే యజమాని కూడా అంతేమొత్తంలో ఇచ్చే వాటాతో కలిపి పీఎఫ్ ఖాతాలో పొదుపు చేస్తూ ఉంటారు. అయితే మారుతున్న టెక్నాలజీ ప్రకారం ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంది. దీనికి అనుగుణంగా యూనివర్శల్ అకౌంట్ నంబర్(యూఏఎన్) ద్వారా ఒక వ్యక్తి ఒకే పీఎఫ్ అకౌంట్ ఉండేలా చర్యలు తీసుకుంది. అలాగే యూఏఎన్ ద్వారా నగదు విత్ డ్రా సేలను కూడా సులభతరం చేసింది. ఈ నేపథ్యంలో కొంత మంది ఖాతాదారులు యూఏఎన్ నంబర్ యాక్టివేషన్‌లో అలసత్వం చూపుతున్నారు. ఇలాంటి వారికి ఈపీఎఫ్ఓ షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 15లోపు యూఏఎన్‌ను యాక్టివేట్ చేసుకోకపోతే ఈపీఎఫ్‌లో కొన్ని సేవలు వారికి వర్తించవని పేర్కొంది.
యూనివర్సల్ అకౌంట్ నంబర్ యాక్టివేట్ చేసుకోవడానికి గడువును ఫిబ్రవరి 15 వరకు మాత్రమే ఈపీఎఫ్ఓ ప్రతినిధులు చెబుతున్నారు. ఈపీఎఫ్ఓ ఫిబ్రవరి 2, 2025 నాటి తన సర్క్యులర్లో యూఏఎన్ యాక్టివేషన్‌తో పాటు ఆధార్ సీడింగ్ కోసం ఫిబ్రవరి 15 తర్వాత ఎలాంటి పొడగింపులు ఉండవని ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొంది. ముఖ్యంగా ఈపీఎఫ్ఓ ఈఎల్ఐ స్కీమ్ ప్రయోజనాలను పొందడానికి యూఏఎన్ యాక్టివేషన్‌తో పాటు ఆధార్ లింక్ చేయడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. యూఏఎన్ అంటే ఈపీఎఫ్ఓ కేటాయించే ఒక ప్రత్యేకమైన 12 అంకెల సంఖ్య. ఇది ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను నిర్వహించడానికి అవసరం. ఇది వివిధ యజమానుల నుంచి అన్ని ఈపీఎఫ్ ఖాతాలను ఒకే ఖాతాలోకి లింక్ చేస్తుంది. ముఖ్యంగా ఉద్యోగాలు మారేటప్పుడు నిధులను సులభంగా బదిలీ చేయడంలో సహాయపడుతుంది. యూఏఎన్‌ను జనరేట్ చేయడానికి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, గుర్తింపు రుజువు (పాస్‌పోర్ట్, ఓటరు ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటితో పాటు చిరునామా రుజువు, బ్యాంక్ ఖాతా వివరాలు మొదలైనవి అవసరం అవుతాయి.
2024 బడ్జెట్‌లో ప్రవేశ పెట్టిన ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) పథకాలు ఉపాధిని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ముఖ్యంగా యజమానులతో పాటు ఉద్యోగులు ఇద్దరికీ ప్రయోజనాలను అందిస్తాయి. ప్రయోజనాలను పొందడానికి ఈపీఎఫ్ఓ నమోదు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం మూడు ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) పథకాలు ఉన్నాయి. స్కీమ్ ఏ మొదటిసారి ఉద్యోగులకు వర్తిస్తుంది, స్కీమ్ బీ తయారీ రంగానికి, స్కీమ్ సీ యజమానులకు మద్దతు అందిస్తుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..